కాంగ్రెస్‌లో చేరికపై కిరణ్‌కుమార్‌రెడ్డి రియాక్షన్

                                 

Last Updated : Jul 6, 2018, 05:28 PM IST
కాంగ్రెస్‌లో చేరికపై కిరణ్‌కుమార్‌రెడ్డి రియాక్షన్

మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ లో పార్టీలో చేరుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ఆయన దీనికిపై స్పందించారు. కాంగ్రెస్ లో చేరికపై తాను ఇప్పటి వరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిరణ్ వివరణ ఇచ్చారు.

ఈ నెల 13న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి కదా.. దీనిపై మీ రియక్షన్ ఏంటి అని మీడియా కిరణ్ ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ తాను కూడా ఈ వార్తలను టీవీ ఛానెళ్లలోనే చూసి తెలుసుకుంటున్నానని చమత్కరించారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని కిరణ్ ఖండిచడం గమనార్హం.

Trending News