OnePlus Nord CE Blasted: యూజర్లను బెంబేలెత్తిస్తోన్న వన్ ప్లస్.. బాంబులా పేలిన మరో ఫోన్

OnePlus Nord CE Blasted: గతేడాది ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) సిరీస్ యూజర్స్‌ను బెంబేలెత్తిస్తోంది. తాజాగా దుశ్యంత్ గోస్వామి అనే వ్యక్తి చేతిలో వన్ ప్లస్ నార్డ్ సీఈ మొబైల్ పేలిపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 12:00 PM IST
  • యూజర్లను బెంబేలెత్తిస్తోన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు
  • దుశ్యంత్ అనే వ్యక్తి చేతిలో పేలిన వన్ ప్లస్ నార్డ్ సీఈ
  • ట్విట్టర్ ద్వారా రిపోర్ట్ చేసిన దుశ్యంత్
  • కొత్త ఫోన్ ఇస్తామని వన్ ప్లస్ టీమ్ హామీ
OnePlus Nord CE Blasted: యూజర్లను బెంబేలెత్తిస్తోన్న వన్ ప్లస్.. బాంబులా పేలిన మరో ఫోన్

OnePlus Nord CE Blasted: గతేడాది ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) సిరీస్ యూజర్స్‌ను బెంబేలెత్తిస్తోంది. లాంచ్ అయిన కొద్దిరోజులకే వన్ ప్లస్ నార్డ్ 2 సిరీస్‌లో లోపాలు బయటపడ్డాయి. కొంతమంది యూజర్స్ చేతిలో ఆ ఫోన్ బాంబులా పేలింది. ఇటీవల దుశ్యంత్ గోస్వామి అనే వ్యక్తికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. పాకెట్‌లో నుంచి మొబైల్ ఫోన్ బయటకు తీస్తుండగా.. అది ఒక్కసారిగా పేలిపోయింది. దుశ్యంత్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

'ఆర్నెళ్ల క్రితం పాపులర్ మొబైల్ బ్రాండ్ 'వన్ ప్లస్ నార్డ్ సీఈ' సిరీస్‌ను కొనుగోలు చేశాను. నిన్న ఉన్నట్టుండి అది ఒక్కసారిగా పేలిపోయింది. మొబైల్ బాగా హీటెక్కినట్లు అనిపించడంతో బయటకు తీశాను. అంతే.. సెకన్ల వ్యవధిలో అది పేలిపోయింది. ఈ ఘటనకు వన్ ప్లస్ బ్రాండ్ సమాధానం చెబుతుందా...?' అని దుశ్యంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. పేలిపోయిన సెల్‌ఫోన్ ఫోటోలను ట్వీట్‌లో షేర్ చేశాడు.

పేలుడు ఘటన తర్వాత వన్ ప్లస్ సపోర్ట్ (OnePlus Team Support) టీమ్‌ను కాంటాక్ట్ చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని... కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని దుశ్యంత్ పేర్కొన్నాడు. ఒకవేళ వన్ ప్లస్ యాజమాన్యం దీనిపై స్పందించకపోతే తాను చట్టపరమైన చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో వన్ ప్లస్ టీమ్ స్పందించక తప్పలేదు. దుశ్యంత్‌ను సంప్రదించిన వన్ ప్లస్ టీమ్ అతనికి కొత్త మొబైల్ పంపిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని దుశ్యంతే ట్విట్టర్‌లో మరో పోస్టు ద్వారా వెల్లడించాడు. 'మీ అందరి సపోర్ట్‌కి ధన్యవాదాలు. నిన్న రాత్రి 8గంటలకు వన్ ప్లస్ టీమ్ నాకు ఫోన్ చేసింది. మంగళవారం(జనవరి 11) నాటికల్లా కొత్త మొబైల్ పంపిస్తామని వారు నాతో చెప్పారు.' అని పేర్కొన్నాడు. అయితే దుశ్యంత్ చేసిన ఈ ట్వీట్స్ ట్విట్టర్ నుంచి తొలగించబడటం గమనార్హం.

వన్ ప్లస్ ఫోన్లు పేలిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. గతేడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ పేలింది. దీనిపై ట్విట్ట‌ర్ ద్వారా వ‌న్ ప్ల‌స్ క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌కు (Smartphones in India) రిపోర్ట్ చేశారు. గతేడాది నవంబర్‌లో మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. వన్ ప్లస్ నార్డ్ 2 ఒక్కసారిగా పేలిపోవడంతో అతని తొడ భాగానికి తీవ్ర గాయమైంది.

Also Read: NEET PG Counselling 2021: నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ ఎప్పుడంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News