'డిసిఐ' ను ప్రైవేటుపరం చేయవద్దు; ఉద్యోగి ఆత్మహత్య

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటుపరం  చేయవద్దంటూ డిసిఐ ఉద్యోగి వెంకటేష్(30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద చోటుచేసుకుంది.

Last Updated : Dec 7, 2017, 02:34 PM IST
'డిసిఐ' ను ప్రైవేటుపరం చేయవద్దు; ఉద్యోగి ఆత్మహత్య

శ్రీకాకుళం: డ్రెడ్జింగ్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటుపరం  చేయవద్దంటూ డిసిఐ ఉద్యోగి వెంకటేష్(30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద చోటుచేసుకుంది. రైల్వే కార్మికుడొకరు సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. వారికి అక్కడ మృతుడి జేబులోంచి ఒక లేఖ, పర్సు దొరికాయి. లేఖలో 'నా చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. డిసిఐను ప్రైవేటుపరం చేయవద్దు' అని రాసి ఉంది. పోలీసులు వెంటనే అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

డిసిఐలో ఉద్యోగం చేసుకుంటున్న వెంకటేష్ (28) ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అప్పులు చేసాడు. డిసిఐను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ఆలోచించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డిసిఐను ప్రైవేటుపరం  చేస్తే అప్పులు తీర్చలేను అని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రభుత్వ హత్యే.. పోరాటాలతో సాధించుకోవాలి

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. ఇకనైనా కేంద్రం డిసిఐను ప్రైవేటుపరం  చేయాలనే ఆలోచనను విరమించాలని.. ఆత్మహత్యలు ఈ సమస్యకు పరిష్కారం కాదని.. పోరాటాలతో సాధించుకోవాలని.. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ డిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది.

Trending News