Kollu Ravindra Gets Bail From Machilipatnam Court: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలంటే చాలు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కాగా, తాజాగా ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పురపాలక ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలతో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. అయితే మంచిలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
ఏపీలో బుధవారం నాడు పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు(AP Municipal Elections 2021) జరుగుతున్న వేళ ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే ఎన్నికల విధులకు ఆటకం కలిగించారని ఐపీసీ 356, 506, 188 సెక్షన్ల కింద కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేటి ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజు పరమ శివుడికి ఏమేం సమర్పించాలి, వేటితో అభిషేకం చేయాలో తెలుసా
అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా కోర్టుకు తరలించారు. మాజీ మంత్రి అరెస్ట్‌కు సంబంధించి అన్ని వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయంలో ప్రొసీజర్ పాటించలేదని ఆయనకు బెలూరు మంజూర్ చేశారు. తన అరెస్టుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) మీడియాతో మాట్లాడారు. అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ఇలాంటి అరెస్టులకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
కాగా, నిన్న ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో కొల్లు రవీంద్రకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. తనతో పోలీసులు సైతం దురుసుగా ప్రవర్తించారని మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆయన బైఠాయించడం తెలిసిందే. అయితే ఓటింగ్‌ను ప్రభావితం చేస్తున్నారని, ఓటు వేసే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.
Also Read: Chiru on vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మద్దతుగా నేను సైతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook