Rajya sabha polls: టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.

Last Updated : Jun 20, 2020, 11:52 PM IST
Rajya sabha polls: టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు

Rajya sabha election | అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ( Rajyasabha polls ) ఘోరంగా అభాసుపాలైన  తెలుగుదేశం పార్టీకి ( TDP ) ఆ పార్టీకు చెందిన సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు మరింత ఇరుకున పెడుతున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. తెలిసి చేసిన వ్యాఖ్యలో  పొరపాటున చెప్పారో తెలియదు కానీ గోరంట్ల వ్యాఖ్యలు మాత్రం ఆ పార్టీని ఇబ్బందులపాలు జేస్తున్నాయి. కావల్సినంత సంఖ్యాబలం లేకపోయినా... ఓడిపోతామని తెలిసినా.. ఓ దళితుడిని రంగంలో దింపి అవమానానికి గురి చేశారంటూ తెలుగుదేశం పార్టీపై ఇప్పటికే అధికార పార్టీ ఆరోపణలు సంధిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఓ న్యూస్ ఛానెల్ డిస్కషన్‌లో గోరంట్ల చేసిన వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. పార్టీ ఉనికి కోసం... పార్టీకి సంఖ్యాబలం ఏ మేరకు ఉందో తెలుసుకోడానికే పోటీకి నిలబెట్టాల్సి వచ్చిందని ఆయన స్వయంగా చెప్పడం దీనికి నిదర్శనం. 

( Read also : ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్ )

తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంఖ్యాబలం 23 మాత్రమే. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపునకు ఇది ఏ మాత్రం సరిపోని గణాంకం. అయితే నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే లభించాయి. దాంతో పార్టీ ఘోరంగా అభాసుపాలైంది. అసలుకే మోసం వచ్చిన పరిస్థితి తలెత్తింది. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గంగాభవానీ ఓటు చెల్లకపోవడం.. అవినీతి ఆరోపణలతో ఆరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటు వేయలేకపోవడం, కరోనా కారణంగా ఓటేయని సత్యప్రసాద్‌తో ఆ సంఖ్య 20కి చేరుకుంది. ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కరణం బలరాం కృష్ణమూర్తి, మద్దాల గిరి, వల్లభనేని వంశీల ఓటు చెల్లలేదు. దాంతో కేవలం 17 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధికి పోల్ అయ్యాయి. 

YSRCP 4 సీట్లు క్వీన్‌స్వీప్ చేయడం ఖాయం ) 

ఇదే విషయంపై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఓడిపోతామని తెలిసే పోటీకి పెట్టారా అనే ప్రశ్నకు సమాధానంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పార్టీ సంఖ్యాబలం ఏ మేరకుందో తెలుసుకోడానికి… పార్టీలో ఎవరున్నారు, ఎవరు లేరనే విషయంపై అంచనా కోసం... పార్టీ ఉనికి కోసమే వ్యూహాత్మకంగా బరిలో దింపామని ఆయన అంగీకరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందనేది ఆ పార్టీనే అంగీకరించినట్టైంది. గత కొద్దికాలంగా 12-13 మంది టీడీపీ నుంచి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు వస్తున్న నేపధ్యంలో ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకునేందుకు అభ్యర్ధిని రాజ్యసభ బరిలో దింపామని ఆయన చెప్పడం కావాలని చేసిందా.. లేదా పొరపాటున దొర్లిన వ్యాఖ్యలా అనేది పార్టీకే తెలియాలి మరి. 

Trending News