Techie Five Marriages: ఐదు పెళ్లిళ్లు చేసుకున్న టెక్కీ సతీష్ బాబు.. ఆ ఫోటోలు లీక్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్...

Techie Five Marriages: ఏపీకి చెందిన ఓ టెక్కీ ఒకరికి తెలియకుండా ఒకరిని.. మొత్తం ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో మహిళలు అతన్ని గుడ్డిగా నమ్మినట్లు తెలుస్తోంది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 29, 2022, 10:38 AM IST
  • ఐదు పెళ్లిళ్లు చేసుకున్న టెక్కీ సతీష్ బాబు
  • ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్న వైనం
  • ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానని ఐదో భార్యకు బెదిరింపులు
Techie Five Marriages: ఐదు పెళ్లిళ్లు చేసుకున్న టెక్కీ సతీష్ బాబు.. ఆ ఫోటోలు లీక్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్...

Techie Five Marriages: నిత్య పెళ్లి కొడుకు శివశంకర్ బాబు 11 పెళ్లిళ్ల ఉదంతం మరవకముందే మరో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సతీష్ బాబు అనే వ్యక్తి ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. విడాకులు తీసుకోకుండానే పెళ్లిళ్లు చేసుకొని ఆ ఐదుగురిని మోసం చేశాడు. పైగా డబ్బుల కోసం వారిని మానసికంగా, శారీరకంగా హింసించాడు. ఐదో భార్య గుంటూరు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు సతీష్ బాబు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సతీష్ బాబు గతంలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. 2005లో విశాఖపట్నంకు చెందిన యువతితో అతని పెళ్లి జరిగింది. తొమ్మిదేళ్ల తర్వాత 2014లో మొదటి భార్యకు తెలియకుండా అమెరికాలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మొదటి భార్యకు తెలియడంతో ఆమెకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత 2017లో నరసారావుపేటకు చెందిన ఓ యువతిని, 2019లో నెల్లూరు జిల్లాకు చెందిన యువతిని, ఈ ఏడాది జూన్‌లో విజయవాడలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. 

విజయవాడ యువతితో హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో కాపురం పెట్టిన సతీష్ బాబు.. కొద్దిరోజులకే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇంటి కొనుగోలుకు డబ్బు కావాలని.. పుట్టింటి నుంచి రూ.80 లక్షలు తీసుకురావాలని భార్యను నిత్యం వేధించేవాడు. డబ్బులు తీసుకురాని పక్షంలో బెడ్‌రూమ్‌లో ఆమె తనతో గడిపినప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించేవాడు. అతని వేధింపులు భరించలేక ఆమె బెంగళూరుకు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తోంది. అయితే సతీష్ బాబు అక్కడికి కూడా వెళ్లి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో ఒకరోజు ఆమె సతీష్ బాబు సెల్‌ఫోన్‌ని పరిశీలించగా.. గతంలో అతను మరో నలుగురిని పెళ్లి చేసుకున్న ఫోటోలు కనిపించాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గుంటూరు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సతీష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై మూడో భార్య, నాలుగో భార్య కూడా గతంలో కేసులు పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: Praveen: చీకోటి ప్రవీణ్‌ తో లింకులున్న నేతలు వీళ్లేనా? క్యాసినో దందా చీకటి కోణాలు ఇవిగో...!

Also Read: Shravana Masam 2022: నేటి నుంచే శ్రావణ మాసం.. ఈ మాసానికి ఉన్న ప్రాముఖ్యత, పురాణ విశిష్ఠత ఏంటి.. ఈ మాసంలో ఏం చేయాలి..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News