Ap Rains Alert: మొన్నటి వరకూ భారీ వర్షాలతో తడిసి ముద్దయిన ఏపీకు మరో మూడ్రోజులు వర్షాలు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరం దాటింది. దాంతో రేపటి నుంచి మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి నిన్న మద్యాహ్నం 3.30 గంటలకు బంగ్లాదేశ్ ఖేపుపరా వద్ద తీరం దాటింది. అక్కడ్నించి తిరిగి పశ్చిమ బెంగాల్ దిఘా సమీపంలో ప్రవేశించి కోల్‌కతాకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపటి వరకూ ఇలాగే కొనసాగి ఆ తరువాత బలహీనపడనుంది. ఈ వాయుగుండం ప్రస్తుతం గంటకు 25 కిలోమటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంవైపుకు కదులుతోంది. దాంతో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. దీనికితోడు రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య గాలులు బలంగా వీస్తుండటంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయగుండంగా మారడంతో హైదరాబాద్ సహా తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడనున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సైతం ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకూ వర్షాలు పడనున్నాయి. మహారాష్ట్ర,కొంకణ్ తీరంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఘండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు రోజులు వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Chandrababu about liquor brands in AP: ఏం తమ్ముడూ.. మీరు తాగేది ఎలాంటి మద్యమో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook