ఐటీ గ్రిడ్ కేసును ప్రస్తావిస్తూ టీ సర్కార్ పై నటుడు శివాజీ సంచలన ఆరోపణలు

                          

Last Updated : Mar 8, 2019, 05:32 PM IST
ఐటీ గ్రిడ్ కేసును ప్రస్తావిస్తూ టీ సర్కార్ పై నటుడు శివాజీ సంచలన ఆరోపణలు

ఐటీ గ్రిడ్ కేసుపై నటుడు శివాజీ స్పందించారు. ఈ వ్యహారంలో  తెలంగాణ ప్రభుత్వం పై తీరును తప్పుబట్టారు.  విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శివాజీ మాట్లాడుతూ  ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ కేసు నమోదు చేశారని విమర్శించారు. 

కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి

ఒకవేళ ఏపీ డేటా చోరీ జరిగితే తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేయడం ఏంటని శివాజీ ప్రశ్నించారు. అదేమంటే ఈ ఘటన తమ ప్రాంత పరిధిలో జరిగిందంటున్నారు.. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధాని అనేది టీఆర్ఎస్ ప్రభుతానికి తెలియదా అని ప్రశ్నించారు. ఒక వేళ ఏపీ సర్కార్ తప్పు చేసిందని భావిస్తే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి కానీ.. ఇలా వారు తలదూర్చడం ఏంటన్ని ప్రశ్నించారు. ఇది ముమ్మటికి రాజకీయ కక్షతో చేరిన పనే అని శివాజీ ఆరోపించారు. కేసుల పేరుతో ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నారని విమర్శించారు

ఓట్ల తొలగింపును పక్కదారి పట్టించేందుకే

తెలంగాణలో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఐటీ గ్రిడ్ కేసు తెరపైకి తెచ్చారని విమర్శించారు.  ఇంటి పేర్లు, ప్రాంతాల పేర్ల ఆధారంగా తెలంగాణలో ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని మర్రిశశిధర్ రెడ్డి బయటపెట్టిన విషయాన్ని శివాజీ గుర్తు చేశారు. టీఆర్ఎస్  ప్రభుత్వం చేస్తున్న పనులతో హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయేలా ఉందని శివాజీ విమర్శించారు. 

డేటా భద్రపరిస్తే తప్పేంటి ?

ప్రభుత్వ లబ్దిదారుల డేటా పొందపర్చడం తప్పేటని ఈ సందర్భంగా శివాజీ రాజా ప్రశ్నించారు. 2018 అగస్టు 28న ఢిల్లీలో బీజేపీ సీఎంల అమిత్ షా మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ లబ్ది దారులన వివరాలను ఫైన్ డ్రైవ్ లో తీసుకోవాలని సీఎంలను అమిత్ షా కోరారని శివాజీ  గుర్తుచేశారు. నమో యాప్ లో కేంద్ర ప్రభుత్వ లబ్ది దారుల డేటా ఉందని ఈ సందర్భంగా శివాజీ రాజీ వ్యాఖ్యానించారు. ఐటీ గ్రిడ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి

Trending News