చంద్రబాబు వర్సెస్ ఏపీ పోలీసుల మధ్య నువ్వా నేనా రీతిలో సాగింది ఘర్షణ. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు..ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ చంద్రబాబు. వెరసి తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోగా..కాన్వాయ్‌కు అడ్డుగా బైఠాయించారు. దీంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర కాలినడకతో అనపర్తి చేరుకున్నారు. టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా అనపర్తి పర్యటన చేపట్టారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 1 అమల్లో ఉండటంతో..పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7 కిలోమీటర్ల మేర నడిచి..అక్కడున్న బొలేరో వాహనం టాప్‌పై నిచ్చెన సహాయంతో ఎక్కి ప్రసంగం పూర్తి చేశారు.
సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో చంద్రబాబు అనపర్తి దేవీచౌక్‌లోనే సభ నిర్వహిస్తానని పట్టుబట్టారు. పోలీసులు ఎలా అడ్డుపడతారో చూస్తానంటూ భీష్మించారు. అటు పోలీసుల అడ్డంకులు, ఇటు టీడీపీ చంద్రబాబు నాయుడు పట్టుదల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకుంటున్నా కాన్వాయ్ ముందుకు కదిలించేందుకే ప్రయత్నించారు. పోలీసులు ముందుకు కదలనివ్వకపోవడంతో..కాలినడకన అనపర్తి చేరుకుని..నిచ్చెన సహాయంతో బొలేరో వాహనం ఎక్కి మరీ ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సామర్లకోట నుంచి అనపర్తి వెళ్తున్న చంద్రబాబును.. బలభద్రపురం దాటిన తర్వాత అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చంద్రబాబు కాన్వాయ్ అక్కడినుంచి ముందుకు వెళ్లకుండా పోలీసులు.. లారీలు, పోలీసు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉంచారు. అంతేకాకుండా చంద్రబాబు వాహనశ్రేణికి అడ్డంగా రోడ్డుపై కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు కూర్చోబెట్టారు. దీంతో చంద్రబాబు బలభద్రపురం నుంచి కాలినడకన అనపర్తికి చేరుకున్నారు.
సామర్లకోట నుంచి అనపర్తి వెళ్తున్న చంద్రబాబుని బలభద్రపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులో రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు వాహనాల్ని ముందుకు కదలనివ్వలేదు. చాలాసేపు పోలీసులతో వాగ్వాదం, ఘర్షణ అనంతరం బలభద్రపురం నుంచి అనపర్తికి గంట 15 నిమిషాల్లో ఆగకుండా..87-8 కిలోమీటర్లు కాలినడకన చేరుకున్నారు. మార్గమధ్యలో పోలీసులు అడ్డుగా పెట్టిన బస్సుల్ని పక్కకు తోసి మరీ చంద్రబాబు పర్యటన ముందుకు కొనసాగింది.
Also read: Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook