కడప: భార్య తలతో పోలీస్‌ స్టేషన్‌కెళ్లిన భర్త

కడప: భార్య తలతో పోలీస్‌ స్టేషన్‌కెళ్లిన భర్త

Updated: Oct 10, 2018, 09:53 AM IST
కడప: భార్య తలతో పోలీస్‌ స్టేషన్‌కెళ్లిన భర్త

వైఎస్సార్‌ కడప జిల్లా సంబేపల్లెలో దారుణం జరిగింది. భార్య తల నరికి భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే దీనికి కారణం.

వివరాల్లోకి వెళితే భర్త వెంటకటరమణ కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి డబ్బులను సంపాదించి భార్య రాణికి పంపిస్తే.. భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు డబ్బులను విలాసాల పేరుతో తగలెట్టిందన్న ఆగ్రహంతో భర్త నరికి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

భార్యపై అనుమానంతో గత కొద్దిరోజులుగా కాపుకాస్తున్న భర్త చంపాలన్నఓ నిర్ణయానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం బైకుపై ప్రియుడుతో కలిసి రాణి వెళ్తుండగా వెంకటరమణ వారిని వెంబడిస్తూ దుద్యాల చెక్ పోస్ట్ వద్ద అడ్డుకొని రాణిని కొడవలితో నరికేశాడు. సంఘటనను చూసిన ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. నరికిన తలతో వెంకటరమణ నేరుగా సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

వెంకటరమణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోనె సంచిలో తెచ్చిన తలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.