తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ విధానం

ఫ్రెండ్లీ పోలిసింగ్‌ పేరుతో నగర ప్రజలకు మరింత చేరువవుతున్న హైదరాబాద్ పోలీసులు..స్ట్రీట్ పెట్రోలింగ్ పేరుతో విన్నూత విధానానికి శ్రీకారం చుట్టారు.

Last Updated : Jul 18, 2018, 04:04 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ విధానం

ఫ్రెండ్లీ పోలిసింగ్‌ పేరుతో నగర ప్రజలకు మరింత చేరువవుతున్న హైదరాబాద్ పోలీసులు..స్ట్రీట్ పెట్రోలింగ్ పేరుతో విన్నూత విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్లు, బైక్‌లతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా సైకిల్ పోలీసింగ్ పేరుతో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

సైకిల్ పోలీసింగ్‌లో భాగంగా.. ఇకపై సైకిళ్ళపై పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. మారుమూర ప్రదేశాల్లోకి కూడా సులువుగా వెళ్లి సత్వర చర్యలు చేపట్టడమే తమ లక్ష్యమని పోలీసులు వివరించారు. సైకిల్‌కు ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్, కమ్యూనికేషన్ అందిండానికి మాన్పాక్ట్, జీపీఎస్ సిస్టమ్, లాఠీ, ఒక వాటర్ బాటిల్ పెట్టుకొనే విధంగా ఏర్పాటు చేశారు. సైకిల్‌ మీద వెళ్లేప్పుడు రక్షణ కోసం హెల్మెట్ కూడా పెట్టుకోనున్నారు పోలీసులు. ప్రస్తుతానికి పంజాగుట్ట పీఎస్ లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా.. రానున్న రోజుల్లో మిగితా పీఎస్‌లకు కూడా అమలు చేస్తామంటున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి అమలు చేస్తున్న ఈ విధానం పట్ల నగర పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Trending News