2018-19 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని యూనివర్శిటీలు, యూనివర్శిటీల పరిధిలోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు కాకతీయ యూనివర్శిటీ ఐసెట్ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి తరపున ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్న కాకతీయ యూనివర్శిటీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం మార్చి 6వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు వుండగా, అత్యధికంగా రూ.10,000 ఆలస్య రుసుంతో మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. మే నెలలో 23-24 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ జరగనుంది. ఐసెట్ 2018 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ తేదీల వివరాలు ఇలా వున్నాయి.
టీఎస్ఐసెట్ 2018 షెడ్యూల్ డైరెక్ట్ లింక్ కోసం ఈ పక్కనున్న లింక్‌పై క్లిక్ చేయండి: http://www.kuwarangal.net/web/notifications/1196_icet%20press%20note181.jpg
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ : మార్చి 6
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చివరి తేదీ ( ఆలస్య రుసుం లేకుండా) : ఏప్రిల్ 30
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చివరి తేదీ ( రూ. 500 ఆలస్యం రుసుం ) : మే 5
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చివరి తేదీ ( రూ. 1,000 ఆలస్యం రుసుం ) : మే 10
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చివరి తేదీ ( రూ. 5,000 ఆలస్యం రుసుం ) : మే 14
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చివరి తేదీ ( రూ. 10,000 ఆలస్యం రుసుం ) : మే 19
ఐసెట్ హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్ ప్రారంభం తేదీ : మే 7
ఐసెట్ పరీక్షల ఫలితాలు, ఫైనల్ కీ విడుదల తేదీ : జూన్ 6
ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు కోసం జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి వుండగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు రూ.450 చెల్లించాల్సి వుంటుంది.