Attack on Jagan : కోడికత్తి దాడిపై జగన్ సరికొత్త ప్రశ్నాస్త్రాలు

కోడికత్తి దాడిపై వైసీపీ చీఫ్ జగన్ మరోమారు స్పందించారు

Last Updated : Jan 7, 2019, 01:58 PM IST
Attack on Jagan : కోడికత్తి దాడిపై జగన్ సరికొత్త ప్రశ్నాస్త్రాలు

శ్రీకాళం జిల్లా సోంబపేట పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ ..కోడికత్తి దాడిపై ఆసక్తిక విషయాలు బయటపెట్టారు. ఓ ప్రముఖ మీడియాతో జగన్ మట్లాడుతూ తనపై జరిగిన దాడి విషయంలో  రాష్ట్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ సందర్భంలో దాడికి సంబంధించిన పలు అంశాలను జగన్ మీడియకు వివరించారు.

జగన్ సంధించిన ప్రశ్నలు ...

* కోడికత్తి దాడి చేసిన నిందితుడిపై గతంలో హత్యా ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి పోలీసులు నో అబ్జక్షన్ సర్టిఫికెట్  (NOC ) ఎలా ఇచ్చారు ?.. NOC ఉంటేనే ఎయిర్ పోర్టు లాంటి సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది..కానీ నిందితుడి విషయంలో ఇలా ఎందుకు జరగలేదు

* జగన్ అనే వ్యక్తి ఎయిర్ పోర్టు వెళ్లున్న సమయంలో సీసీ కెమెరాలు నిలిపివేశారు. తన మీద హత్యాయత్నం జరిగిన సమయంలో ఇవి పనిచేయలేదు...రిపేరు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. అంటే ఇది ఉద్దేశ పూర్వంగా చేసింది అనుకోవచ్చు కదా ?

* దాడి జరిగిన గంటకే  రాష్ట్ర డీజీపీ, టీడీపీ నేతలు, చంద్రబాబు స్పందించడం ఏంటి ? హత్యాయత్నం జరిగిన గంటలోనే జనాలను మిస్ లీడ్ చేసే విధంగా డీజీపీ మాట్లాడారు..టీడీపీ నేతలు కూడా ఇలాగే వ్యవహరించారు.

* కేసును తప్పుదోవ పట్టించేందుకు గంటల వ్యవధిలో మార్పింగ్ చేసి ఫ్లక్సీ తెరపైకి తెచ్చారు..దాడికి పాల్పడింది వైసీపీ అభిమాని టీడీపీ వారు ప్రచారం చేశారు. ఫ్లక్సీలో గరుడ ఫోటో గమనించాం...ఎవరైన అభిమనంతో ఫ్లక్సీ పెడితే ..వైఎస్‌ఆర్ బొమ్మ కానీ.. విజయమ్మ బొమ్మకానీ ఉండాలి కదా ? అని ప్రశ్నించారు. ఇలా మార్పింగ్ చేసిన ఫ్లక్సీని తెరపైకి తెచ్చి..దాడి చేసిన మనిషి.. నా అభిమాని అని తప్పుడు ప్రచారం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?

* ఇవన్నీ గమనించిన తర్వాతే తాము స్పందించాము. దాడిలో రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానలు వ్యక్తం చేశాం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానికి సంబంధం లేని థార్డ్ పార్టీతో ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేశారు.. మూడో పార్టీ అనేది కేంద్రం కావొచ్చు లేక.. ఎవరితో ఒకరితో చేయాలని కోరాం..అయినా దీన్ని చంద్రబాబు పట్టించుకోలేదు.. అందుకే కోర్టు వెళ్లి న్యాయం కోరాం..ఈ క్రమంలో స్పందించిన కేంద్రం.. విచారాణను ఎన్ఐఏ అప్పగించిందని జగన్ వివరించారు

* దాడి జరిగినపుడు జెంటిల్ మెన్ లా వ్యవరించా..వైల్డ్ స్టేట్ మెంట్ ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది..ప్రతిపక్ష నాయకుడి లాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నందుకే సంమమనం పాటించానని జగన్ వివరించారు. దాడి జరిగిన తీరు..తర్వాత జరిగిన పరిణామాలు అన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాను స్పందించానని జగన్ వివరించారు. 

Trending News