Janhvi Kapoor belly dance : బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ

Janhvi Kapoor belly dancing : జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్‌  నేర్చుకున్నాని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని రణ్‌వీర్‌ అడిగాడు. జాన్వీ వెంటనే బెల్లీ డ్యాన్స్ చేసి చూపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 08:55 AM IST
  • బెల్లీ డాన్స్‌ తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌
  • రణ్‌వీర్‌సింగ్‌ షోలో మెరిసిన ముద్దు గుమ్మలు
Janhvi Kapoor belly dance : బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ

Janhvi Kapoor teaches Sara Ali Khan and Ranveer Singh belly dancing : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ (Sara Ali Khan) తక్కువకాలంలోనే తమ అందచందాలతో పాటు నటనతోనూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ భామలు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ ఇద్దరూ ఇప్పుడు బెల్లీ డాన్స్‌ (belly dance) తో అందరి మనస్సులను దోచారు. 

రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh) ‘ది బిగ్‌ పిక్చర్‌’ అనే షోకి హోస్ట్‌ గా చేస్తున్నాడు. తాజాగా జాన్వీ (Janhvi Kapoor), సారా(Sara Ali Khan) గెస్ట్స్‌గా ఈ కార్యక్రమానికి వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమోస్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్‌ (belly dance) నేర్చుకున్నాని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని రణ్‌వీర్‌ (Ranveer Singh) అడిగాడు. జాన్వీ వెంటనే బెల్లీ డ్యాన్స్ (belly dance) చేసి చూపించింది. ప​క్కనే ఉన్న సారా కూడా జాయిన్ కావడంతో ఇద్దరూ బెల్లీ డ్యాన్స్ చేశారు. వారికి తోడుగా రణ్‌వీర్ కూడా జత కలిశాడు. మొత్తానికి ముగ్గురు బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

 

Also Read : Rajinikanth PeddannaTeaser: రజనీకాంత్‌ ‘పెద్దన్న’ టీజర్‌‌ అదిరింది.. ఫ్యాన్స్‌కు వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌

ఇక సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌ ఇద్దరు 2018లో ఒకే టైమ్‌లో బాలీవుడ్‌లోకి హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. సారా.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో (Sushant Singh Rajput) కలిసి కేథార్‌నాథ్‌ చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. రణ్‌వీర్‌ సింగ్‌తో సింబా మూవీలో నటించి బ్లాక్‌ బస్టర్‌ని తన అకౌంట్‌ లో వేసుకుంది సారా. లవ్‌ ఆజ్‌ కల్‌, కూలీ నెం.1 మూవీల్లోనూ నటించింది ఈ భామ. ఇప్పుడు ధనుష్‌ సరసన `అట్రాంగి రే`లో నటిస్తోంది సారా.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

అలాగే జాన్వీ కపూర్‌ ధడక్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఘోస్ట్ స్టోరీస్‌, ఆంగ్రేజీ మీడియం, గుంజాన్‌ సక్సేనా,రూహి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం దోస్తానా 2, గుడ్‌లక్‌ జెర్రీ, మిలి సినిమాల్లో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) బిజీగా ఉంది.

Also Read : Vallabhaneni Vamsi : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్, ఇప్పుడే రాజీనామా చేస్తా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News