కాపు సంఘాల నేతల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు

కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Last Updated : Jan 23, 2019, 12:59 PM IST
కాపు సంఘాల నేతల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు

అమరావతి: కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాపు కోటా రిజర్వేషన్ల బిల్లును ఏపీ కేంద్రానికి పంపించినా కేంద్రం ఆ బిల్లును పట్టించుకోలేదని.. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కాపులకు ఎంతో మేలు చేస్తుందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ప్రకటన అంశంపై కొత్తపల్లి సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తంచేశారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు అందించిన చంద్రబాబు.. ఈ 5 శాతం కోటాతో 60 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కారం చేసిన వారు అయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాపుల తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుంటే, మరోవైపు తిరుపతిలోనూ కాపు సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాపులకు 5 శాతం కోటా కల్పించిన ముఖ్యమంత్రికి కాపులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పలువురు కాపు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. 

Trending News