Attack On Kotamreddy Srinivasulu Reddy: నెల్లూరు: నెల్లూరు నగర నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని తన ఇంటి ముందే ఓ గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. అప్పటి వరకు ఆయన ఉంటున్న ఇంటి గేటు ఎదుటే పార్క్ చేసి ఉన్న కారు.. అదును చూసి ఆయన్ను ఢీకొట్టింది. ఈ కారు యాక్సిడెంట్ లో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది. వెంటనే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనుచరులు, టిడిపి శ్రేణులు ఆయన్ను నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించారు. కోటంరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన ఎడమ కాలు ప్యాక్చర్ అయిందని తెలిపారు.
కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ దాడి ఘటనపై స్పందించిన టీడీపీ నేతలు.. శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ దాడిని అధికార పార్టీ నేతల దాడిగా అభివర్ణించిన టీడీపీ నేతలు.. టీడీపి నాయకులను బెదిరించడానికే వైసీపీ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ స్పందిస్తూ.. నెల్లూరులో వైసీపీ నేతల అరాచకాలు శృతిమించిపోయాయని.. మనుషులపై దాడులు చేయడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటి వద్ద ఉన్న టిడిపి నాయకుల మీద కూడా దాడులు చేయించే నీచపు సంస్కృతికి వైసీపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీకి అధికారం శాశ్వతం కాదనే విషయం తెలియక టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని.. రాబోయే రోజుల్లో దీనికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని అజీజ్ హితవు పలికారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా డ్రగ్స్ మాఫియాగా మారిపోయిందని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో గుద్దిన రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డిని ఆయన పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా డ్రగ్స్ మాఫియాగా మారిపోయి కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థులు ప్రవర్తనలు కూడా పూర్తిగా మారిపోయాయి అని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు వీటిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. టిడిపి నేతపై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి ఘటనలో ఆయన ఇంటి ముందు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ బయటికి వచ్చాయి. అప్పటివరకు ఇంటి ముందే పార్క్ చేసి ఉన్న కారు ఉన్నట్టుండి కొంతవెనక్కి తీసుకుని మరి ఆయన్ను ఢీకొట్టడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో, మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి కోటంరెడ్డి ఇంటికి పోలీసులు.. సీసీటీవీ డీవీఆర్ విషయంలో వాగ్వాదం
Also Read : B.Tech Students Dance: క్లాస్ రూమ్‌లో విద్యార్థుల అసభ్యకర నృత్యం.. వీడియో వైరల్
Also Read : Pawan Kalyan About Caste: దేశం భావన లేకపోయినా.. కులం భావన పెట్టుకోండి: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook