కోటప్పకొండపై చంద్రబాబు వరాల జల్లు

  

Last Updated : Nov 11, 2017, 07:37 PM IST
కోటప్పకొండపై చంద్రబాబు వరాల జల్లు

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈనెల 27న కోటప్పకొండపై రోప్ వే ప్రారంభించడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వస్తున్నారని .. ఆ రోజే శంఖుస్థాపన కార్యక్రమం కూడా పూర్తవుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అలాగే నరసరావుపేటలో జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మీడియాకి తెలియజేశారు.రాబోయే శివరాత్రికి ఇదే పుణ్యక్షేత్రంలో రోప్ వే, స్వాగతద్వారం, ఎక్వేరియం మొదలైన వాటి ఆధునీకరణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు.ప్రస్తుతం పలు అభివృద్ది పనుల ద్వారా కోటప్పకొండను పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కోడెల తెలిపారు. ప్రస్తుతం కోటప్పకొండపై తిరుమల దేవస్థానమువారి సత్రము, ప్రభుత్వ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. కొండ దిగువున భక్తుల కోసం చాలా కాలము క్రితం నిర్మించిన బసవ మందిరము కూడా ఉంది. 

 

Trending News