AP SSC Result 2024 Live: అయ్యో.. ఆ స్కూల్స్‌లో అందరూ ఫెయిల్..!

AP Class 10th Result 2024 Live: ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది విద్యార్ధులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  examresults.ap.nic.in, results.bie.ap.gov.in, results.apcfss.in, bie.ap.gov.in వెబ్‌సైట్స్‌లో ఫలితాలు చెక్ చేసుకోండి. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 22, 2024, 12:00 PM IST
AP SSC Result 2024 Live: అయ్యో.. ఆ స్కూల్స్‌లో అందరూ ఫెయిల్..!
Live Blog

AP Tenth Results Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటిరీకరణ అన్ని పూర్తి కావడంతో అధికారులు ఆన్‌లైన్‌ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 3,17,939 కాగా బాలికల సంఖ్య 3,05,153గా ఉంది. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరిగాయి. ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్‌ లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

22 April, 2024

  • 11:59 AM

    AP Tenth Results Live Updates: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడి నిరుత్సాహానికి గురి కావద్దని అధికారులు సూచించారు. జీవితంలో ఇది చిన్న అడుగు మాత్రమేనని.. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రనా జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని కోరారు.

  • 11:37 AM

    AP Tenth Results Live Updates: 2,803 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని అధికారులు తెలిపారు. 17 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. 

  • 11:27 AM

    AP Tenth Results Live Updates: మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి రీవాల్యుయేషన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
     

  • 11:18 AM

    AP Tenth Results Live Updates: బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికలు 89.17 శాతం మంది పాస్ అయ్యారు.
     

  • 11:15 AM

    AP Tenth Results Live Updates: ఏపీ పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పార్వతీపురంమన్యం జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం 96.37 కాగా.. కర్నూలు జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం 62.47 నమోదైంది.

  • 11:12 AM

    AP Tenth Results Live Updates: పదో తరగతి పరీక్షల ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ రిలీజ్ చేశారు. విద్యా సంవత్సరం ముగియకముందే తొలిసారి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

  • 11:03 AM

    AP Tenth Results Live Updates: ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌ను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.
     

  • 10:54 AM

    AP Tenth Results Live Updates: పదో తరగతి పరీక్షలు మార్చి 18న ప్రారంభమై.. మార్చి 30న ముగిశాయి. దాదాపు 6 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.
     

  • 10:36 AM

    AP Tenth Results Live Updates: పదో తరగతి ఫలితాలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా.. అరగంట ఆలస్యంగా అంటే 11.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. 

  • 10:28 AM

    AP Tenth Results Live Updates: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి “జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియెన్స్ అవార్డులు)” ఏపీ ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించింది. ఈ పథకం కింద నగదు బహుమతులు అందజేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను మెడల్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్‌తో సత్కరించారు. ఎస్‌ఎస్‌సీ టాపర్‌లకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు నగదు పురస్కారం అందించారు. జిల్లా ఎస్‌ఎస్‌సీ టాపర్లకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.15 వేలు నగదు పురస్కారం లభించింది. రాష్ట్రస్థాయిలో రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు అందుకున్నారు.
     

  • 10:06 AM

    AP SSC 10th Result Live Update: bse.ap.gov.in, manabadi.co.in విద్యార్థులు పదో తరగతి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

  • 09:46 AM

    Andhra Pradesh Tenth Results Live Updates: గ్రేడ్‌ల రూపంలో ఫలితాలు విడుదల కానున్నాయి.

    ==> 91-100 మార్కులు = A1 గ్రేడ్

    ==> 81-90 మార్కులు = A2 గ్రేడ్

    ==> 71-80 మార్కులు = B1 గ్రేడ్

    ==> 61-70 మార్కులు = B2 గ్రేడ్

    ==> 51-60 మార్కులు = C1 గ్రేడ్

    ==> 41-50 మార్కులు = C2 గ్రేడ్

    ==> 35-40 మార్కులు = D గ్రేడ్

  • 09:33 AM

    Andhra Pradesh Tenth Results Live Updates: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నేడు ఉదయం 11 గంటల నుంచి విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించనుంది. 
     

  • 09:07 AM

    Andhra Pradesh Tenth Results Live Updates: ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

     results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత ముందుగా హోమ్ పేజీలో కనిపించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి. విద్యార్ధి రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు స్క్రీన్‌పై ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. 
     

  • 08:59 AM

    Andhra Pradesh Tenth Results Live Updates: పదో తరగతి ఫలితాలు results.bse.ap.gov.inలో అలాగే SMS, DigiLocker, ఇతర మొబైల్ యాప్‌లలో చెక్ చేసుకోవచ్చు. 

  • 08:39 AM

    Andhra Pradesh Tenth Results Live Updates: సంవత్సరాల వారీగా ఉత్తీర్ణత శాతం

    ==> 2023    72.26%
    ==> 2022    64.02%
    ==> 2021    100% (కరోనా సమయంలో)
    ==> 2020    100% (కరోనా సమయంలో)
    ==> 2019    94.88%
    ==> 2018    94.48%
    ==> 2017    91.92%
    ==> 2016    93.26%

Trending News