గుంటూరు: సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీల పెంపునకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మీడియాకు తెలిపారు. తాజా ప్రతిపాదనను ముఖ్యమంత్రితో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి నక్కా ఆదనంబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హస్టళ్లు, గురుకులాల సౌకర్యాల మెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు..ఈ చర్యలో భాగంగా సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచుతున్నామని..తర్వలో దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆదనంబాబు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.76 కోట్లతో గురుకుల పాఠశాలల్లో బంకర్ బెడ్లు, రూ.84 కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని హాస్టళ్లంటినీలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎస్సీ సంక్షేమానికి రూ.4.5 వేల కోట్ల ఖర్చు.. అలాగే గిరిజన సంక్షేమానికి రూ.18 వందల కోట్ల నిధులు ఖర్చు చేశామని మంత్రి వెల్లడించారు..