అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు కారణమనే రీతిలో ఆయన స్పందించారు. మొదటి నుంచి టీడీపీకి, చంద్రబాబుకు గట్టి మద్దతు దారుడిగా నిలిచిన సీనియర్ నేత కోడెలను ప్రాధాన్యత తగ్గించడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేందనే కారణాన్ని మంత్రి కొడాలినాని ఎత్తిచూపారు.
మీడియా సమావేశంలో మంత్రి నాని కొడాలి నాని స్పందిస్తూ కోడెల కోరుకున్న నర్సరావుపేట సీటు ఇవ్వకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేయించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. కోడెలకు బదులు ఆయన కంటే జిల్లాకు చెందిన జూనియర్ల నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన ఆయన ప్రాధ్యాన్యతను తగ్గించారు. పార్టీలో సీనియర్ నేత ఉన్న కోడెలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో విమర్శలు వస్తున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో కోడెలను స్పీకర్ పదవి ఇచ్చారు.
ఇది చాలన్నదన్నట్లు అధికారం కోల్పోయిన తర్వాత కేసులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోడెలకు..సొంత పార్టీ నుంచి నైతిక మద్దతు లేకపోవడం వల్ల ఆయన మనోధైర్యం కోల్పోయారని... ఇబ్బందుల్లో ఉన్న కోడెలకు చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా చంద్రబాబు తీరు వల్లే కోడెలకు మనస్థాపానికి గురించేసిందని మంత్రి నాని విమర్శించారు.
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు కారణం వైసీపీ సర్కార్ వేధింపులే కారణమంటూ టీడీపీ విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైసీపీ కూడా టీడీపీ విమర్శలకు అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని ఈ మేరకు స్పందించారు.