తీరు మార్చుకోకపోతే తాట తీస్తా: బాలకృష్ణ

ఎప్పుడూ సరదాగా.. నవ్వుతూ కనిపించే బాలకృష్ణకు ఒక్కసారిగా కోపమొచ్చింది.

Last Updated : Jun 8, 2018, 04:16 PM IST
తీరు మార్చుకోకపోతే తాట తీస్తా: బాలకృష్ణ

ఎప్పుడూ సరదాగా.. నవ్వుతూ కనిపించే బాలకృష్ణకు ఒక్కసారిగా కోపమొచ్చింది. అందరూ కలిసి పనిచేయాలని, లేకుంటే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే.. గురువారం హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ పంచాయితీల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిలమత్తూరు మండల టీడీపీ నేతలతో సమీక్ష జరిపారు. గత నాలుగేళ్లలో పెండింగ్ పనులు, అభివృద్ధి పనులపై నేతలు ఆయనకు కలిసి వివరించారు. అభివృద్ధి పనులను సర్పంచులు, ఎంపీటీసీలే పంచుకుంటున్నారని, కార్యకర్తల బాగోగులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటివరకు జరిగిన దాన్ని మరిచిపోయి ఇకపై అందరూ కలిసి పనిచేయాలని, లేకుంటే తన విశ్వరూపం చూస్తారని బాలయ్య హెచ్చరించారు.

అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని అన్ని పంచాయితీల టీడీపీ నాయకులకు బాలకృష్ణ సూచించారు. టీడీపీ పెట్టినన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నారని.. వారికి అండగా నిలవాలని.. పార్టీకి చెడ్డపేరు తీసుకురాకుండా పనిచేయాలని.. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అనంతరం అమృత పథకం కింద హిందూపురం పట్టణంలో నిర్మించిన నందమూరి బసవతారక రామారావు పార్కును ఆయన ప్రారంభించారు.

Trending News