అమరావతి పేరిట మొబైల్ యాప్..!

Last Updated : Oct 7, 2017, 03:11 PM IST
అమరావతి పేరిట మొబైల్ యాప్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరిట ఒక యాప్ విడుదల కానుంది. "మన అమరావతి" పేరుతో అమరావతి ప్రాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ భూములు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? మొదలైన సమాచారాన్ని అందించే యాప్‌ను సీఆర్‌డీఏ తయారుచేసింది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు అందించిన గ్రామాల రైతులకు ఇచ్చిన స్థలాల లేఅవుట్లు, మ్యాపులు మొదలైనవి కూడా ఆ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. 

Trending News