Nandyala Constable Murder: నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. స్థానిక కానిస్టేబుల్ ఒకరిని ఆ రౌడీ షీటర్లు దారుణంగా హతమార్చారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కత్తులతో పొడిచి చంపారు. గతంలో పలు నేరాల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్సే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో గూడూరు సురేంద్ర (38) అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం (ఆగస్టు 7) రాత్రి తన విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో సురేంద్ర ఓ టైలర్ షాపు వద్ద ఆగగా.. కొంతమంది రౌడీ గ్యాంగ్ అతన్ని గమనించారు. మద్యం మత్తులో ఉన్న ఆ గ్యాంగ్ సురేంద్ర వద్దకు వచ్చి గొడవకు దిగారు. బీరు సీసాలతో సురేంద్ర తలపై కొట్టారు.
ఈ క్రమంలో సురేంద్ర పారిపోయేందుకు యత్నించగా అతన్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. అనంతరం ఓ ఆటో డ్రైవర్‌ను బెదిరించి సురేంద్రను అందులో ఎక్కించి పట్టణ శివారులోని ట్యాంక్ బండ్ వైపు తీసుకెళ్లారు. అక్కడ కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. హత్యానంతరం ఆరుగురు నిందితుల్లో ముగ్గురు పరారయ్యారు. మరో ఇద్దరు మళ్లీ నంద్యాల టౌన్‌లోకి వచ్చి బుల్లెట్ బైక్స్‌పై వెళ్తున్నవారిని బెదిరించి బైక్స్ లాక్కున్నారు. ఆపై ఆ బైక్స్‌పై పరారయ్యారు.
స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. సురేంద్రను హత్య చేసిన రౌడీ గ్యాంగ్ గతంలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నంద్యాల టౌన్‌లో సురేంద్రను వెంటపడి తరిమిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీ ద్వారా సేకరించారు.ప్రస్తుతం ఆ రౌడీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. నిందితులపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Horoscope Today August 9th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ఇవాళ అదృష్టం వెన్నంటే ఉంటుంది..