Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనక ఉన్న అసలు కారణం ఇదే..?

Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేశారని వార్తలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమరావతి భూముల కేసేనని తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును మార్చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 02:00 PM IST
  • ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు
  • అమరాతి భూముల వ్యవహారంలోనే నారాయణ అరెస్టు
  • గంటల వ్యవధిలోనే కేసు మార్చేసిన ఏపీ పోలీసులు
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనక ఉన్న అసలు కారణం ఇదే..?

Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌ మెంట్‌ లో అవకతవకలు జరిగినట్టు ఏపీ సీఐడీకి ఫిర్యాదులు అందాయి. టీడీపీ హయాంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నారాయణ స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ ఏపీ కేపిటల్‌ తో పాటు, ఆలైన్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో మార్పులు చేసినట్టు మంగళగిరి ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్‌ 27న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. దాని ఆధారంగానే ఏపీ సీఐడీ పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 

ఈ ఫిర్యాదులో మొత్తం 14 మందిపై పోలీసులు కేసు రిజిస్ట్రర్‌ చేశారు. అందులో ఏ1గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏ2గా నారాయణ ఉన్నారు. ఇక ఏ3గా విజయవాడకు చెందిన లింగమనేని రమేశ్‌, ఏ4గా లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ ఉన్నారు. ఏ5 గా రామకృష్ణ హౌజింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డెరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌, ఏ6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఏ7గా Lepl ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఏ8గా LEPL ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్‌, ఏ9గా LEPL స్మార్ట్‌ సిటీ ప్రైవేటు లిమిటెడ్‌, ఏ 10గా లింగమనేని అగ్రికల్చర్‌ డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఏ 11గా లింగమనేని అగ్రో డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఏ 12గా జయని ఎస్టేట్స్‌, ఏ 13గా రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఏ 14గా ప్రభుత్వ అధికారులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తులను ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చారు. ఐసీపీలోని సెక్షన్‌ 120B, 420, 34, 35, 36, 37, 166, 167, 217 లతో పాటు సెక్షన్‌ 13(2) R/W, 13(1)(a)  ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ 1988 కింద కేసులు నమోదుచేశారు.

అయితే ముందుగా నారాయణ అరెస్టుకు ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారమే కారణమని చెప్పారు. ఈ కేసులోనూ నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పోలీసులు.. హైదరాబాద్‌ కొండాపూర్‌ లోని నారాయణ నివాసానికి వెళ్లి అరెస్టు చేసినట్టు వార్తాలు వెలువడ్డాయి. నారాయణను అరెస్టు చేసి చిత్తూరుకు తరలిస్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులు వారి వాహనాన్ని ఆపారు. డాక్యుమెంట్లు తనిఖీచేసి అక్కడి నుంచి పంపించారు. 

ఇక తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌ నుంచే  తెలుగు పేపర్‌ లీకేజీ అయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌ వాట్సప్‌ నుంచి బయటకు వెళ్లినట్టు తేలింది. చిత్తూరు టాకీస్‌ అనే గ్రూప్‌ లో ప్రశ్నాపత్రం పోస్టు చేశాడని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఉదయం 9:57 నిమిషాలకు పేపర్‌ లీకేజీ అయిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే గిరిధర్‌ తో పాటు మరో ఇద్దరినీ కూడా అరెస్టు చేశారు. అటు నారాయణ అరెస్టు నేపథ్యంలో సీఎం జగన్‌ తో విద్యాశాఖ మంత్రి బొత్స భేటీ అయ్యారు. మరోవైపు నారాయణ అరెస్టును ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఖండించారు. 

కొద్దిరోజుల క్రితం తిరుపతి వేదికగా జరిగిన ఓ బహిరంగసభలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నాపత్రాల లీకేజీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణ, శ్రీ  చైతన్య విద్యాసంస్థలపైనే బహిరంగంగా ఆరోపణలు చేశారు. పేపర్‌ లీకేజీకి వాళ్లే కారణమని చెప్పారు. కఠిన చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నారాయణ దంపతులను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. 

నారాయణ అరెస్టుపై ఏపీ టీడీపీ తీవ్రంగా స్పందించింది. విశాఖ పాలిమోర్స్‌ ఘటనలో అంతమంది చనిపోతే ఆ సంస్థ సీఈవోను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కల్తీసారా తాగి జనాలు చనిపోతే ఎక్సైజ్‌ మినిస్టర్‌ ను ఎందుకు అరెస్టు చేయలేదని టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. 

Also Read:Mohali RPG Attack: ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై రాకెట్‌ దాడి, ఉగ్రవాదుల పనే అని అనుమానం..?

Also Read:Rohit Sharma: జస్ప్రీత్ బుమ్రా అద్భుతం కానీ.. ముంబై ఓటమి అనంతరం రోహిత్ శర్మ ఏమ్మన్నాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News