LG Polymers incident: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వ పనితీరుపై ప్రశంస

LG Polymers incident:దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ప్రమాదం విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఈ ఘటనపై ప్రభుత్వ పనీతీరుపై ప్రశంసలు కురిపించింది.   

Last Updated : Feb 20, 2021, 09:50 AM IST
  • విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్న జాతీయ మానవ హక్కుల కమీషన్
  • విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
  • ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మరణించిన 12 కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించిన ప్రభుత్వం
LG Polymers incident: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వ పనితీరుపై ప్రశంస

LG Polymers incident:దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ప్రమాదం విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఈ ఘటనపై ప్రభుత్వ పనీతీరుపై ప్రశంసలు కురిపించింది. 

ఆంధ్రప్రదేశ్  విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ( LG Polymers )లో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే. 2020 మే 7న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి లీకైన విష వాయువుల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమీషన్( National human rights commission ) సుమోటోగా స్వీకరించి దర్యాప్తు నిర్వహించింది. ఈ ఘటనలో బాధితుల్ని ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం( Ap Government ) తీసుకున్న చర్యలు సంతృప్తినిచ్చాయని ఎన్‌హెచ్‌ఆర్‌సి ( NHRC ) తెలిపింది. బాధితులకు పరిహారం అందించడంలో సంబంధిత అధికారులపై తీసుకున్న చర్యపై రాష్ట్ర ప్రభుత్వం అందించిన కార్యాచరణ నివేదికను అంగీకరిస్తున్నట్టు మానవ హక్కుల కమీషన్ పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన 12 మంది కోటి రూపాయలు చొప్పున, రెండు మూడ్రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినవారికి లక్ష రూపాయల చొప్పున అందించడమే కాకుండా 12 మందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టింది ప్రభుత్వం. 

ఈ ప్రమాద ఘటన అనంతరం ఆర్ఆర్వీ పురం, నందమూరి నగర్, కంపరపాలెం, పద్మనాభనగర్, ఎస్సీ, బీసీ కాలనీ, మేఘాద్రిపేట కాలనీల్లోని 17 వేల ఇళ్ల నుంచి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు నివేదికలో ప్రస్తావించారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్ పై ఉన్నవారికి పది లక్షల రూపాయలు, మృతి చెందిన జంతువుల యజమానులకు 8 లక్షల 75 వేలు అందించారన అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్( National green tribunal )ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వద్ద 50 కోట్లు డిపాజిట్ చేశామని ప్రభుత్వం వివరించింది. ఈ ఘటనలో 437మందిని విచారించి 12మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా సంస్థ సీఈవో, డైరెక్టర్లు, సీనియర్ అధికారుల పాస్‌పోర్టుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం. ఈ ఘటనపై మరికొన్ని శాఖల నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పేర్కొంది. 

Also read: Ap High court: ఆ అధికారం ఎన్నికల కమీషనర్‌కు ఎక్కడిది..ఎక్కడి నుంచి వచ్చింది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News