GHMC Election Bettings: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. సెటిలర్ల ఓట్లే కీలకం కావడంతో ఇప్పుడు గ్రేటర్ పీఠంపై కోట్లాది రూపాయల బెట్టింగ్ ఏపీలో నడుస్తోంది.
గ్రేటర్ ఎన్నికలు ( Greater Elections ) ముగిశాయి. మరి కొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. డిసెంబర్ 4 న అంటే రేపు జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ( Telangana )లో కంటే..ఏపీలోనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లే డిసైడర్లు కావడంతో ఉత్కంఠ రేపుతున్నాయి. ఏపీ బడాబాబులు, రాజకీయ నేతలు గ్రేటర్ పీఠంపై కన్నేసి..బెట్టింగులు నడుపుతున్నారు.
ఐపీఎల్ 2020 ( IPL 2020 ) సీజన్ ముగియడంతో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల దృష్టి జీహెచ్ఎంసీ ( GHMC )పై పడింది. ఏపీని లక్ష్యంగా చేసుకుని పందేలు నడుపుతున్నారు. జీహెచ్ఎంసీ పీఠం ఎవరి వశం కానుంది..టీఆర్ఎస్ సీట్లు సెంచరీ దాటుతాయా లేదా..బీజేపీకు ఎన్ని సీట్లు వస్తాయి..కాంగ్రెస్, టీడీపీల ప్రభావమెంత..ఇలా వివిధ అంశాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన నగరం హైదరబాద్. ఏపీకు చెందిన లక్షలాదిమంది హైదరాబాద్ లోనే ఉద్యోగ, వ్యాపార నిమిత్తం సెటిలయ్యారు. వారే ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్లుగా ఉన్నారు. అందుకే జీహెచ్ఎంసీ ఫలితాల ( GHMC Results )పై విజయవాడ, రాజమండ్రి, విశాఖ, ఏలూరు, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో జోరుగా పందేలు నడుస్తున్నాయి.
మరి కొద్ది గంటల్లో గ్రేటర్ ఫలితం వెలువడనుంది. బెట్టింగ్ ఎక్కువగా టీఆర్ఎస్ ( TRS ), బీజేపీ ( BJP), ఎంఐఎం (MIM ) పార్టీల మధ్యే సాగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్- బీజేపీ ( TRS-BJP )మధ్య ఉంది. బెట్టింగ్ రేషియోను పరిశీలిస్తే..టీఆర్ఎస్ గెలుపుపై 1కి 1 నడుస్తోంది. అటు బీజేపీ గెలిస్తే మాత్రం 1కి 4 నడుస్తోంది. అంటే బీజేపీ గెలుపుపై పందెం కడితే..100కు 4 వందలు వస్తాయన్న మాట. ఎంఐఎం మేయర్ పీఠం చేజిక్కించుకునే విషయంపై 1కి 5 నడుస్తోంది. అంటే ఎంఐఎంకు మేయర్ పీఠం దక్కితే వంద రూపాయలకు 5 వందలు లభిస్తాయన్నమాట.
అయితే బీజేపీ ( BJP )పై ఎక్కువ అంచనా బెట్టింగ్ ఉంది కాబట్టి..బీజేపీ నెగ్గుతుందని భావించలేం. ఎందుకంటే పొలిటికల్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఒకలాంటిదే. బెట్టింగ్ మాఫియా ఎప్పుడూ నష్టం కోరుకోదు. కాబట్టి 1కి 5 నడుస్తున్నప్పుడు 1 ఎవరివైపుందో వారికే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువుంటాయనేది బెట్టింగ్ పరిభాష.
ఇక విశ్లేషకులైతే టీఆర్ఎస్ పార్టీకు 70-80 మధ్య సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ గతం కంటే ఎక్కువగా అంటే 20-30 సీట్లు వస్తాయని పందేలు నడుస్తున్నాయి. మొత్తం రిజల్ట్‌పై వంద నుంచి 5 వందల కోట్ల వరకూ బెట్టింగులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. క్లబ్బులు, పబ్బులు, గెస్ట్‌హౌస్‌లలో బెట్టింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయట. Also read: AP: ఎన్నికల కమీషన్ ఉత్తర్వులపై స్టేకు హైకోర్టు నో..