AP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై స్టేటస్ కోసం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ వాయిదా పడింది.
ఏపీ ( Ap )లో స్థానిక సంస్థల ఎన్నికల ( Local Body Elections ) పంచాయితీ తెగడం లేదు. ఈ ఏడాది మార్చ్ లో నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించినప్పుడు ఎన్నికల కమీషన్ కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా చూపి నిరాకరించింది. వాస్తవానికి మార్చ్ నెలలో కరోనా కేసులు దేశంలోనే పదుల సంఖ్యకు చేరుకోలేదు. తరువాత ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Election commissioner Nimmagadda Ramesh kumar ) కు ప్రభుత్వానికి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అనంతరం ఇప్పుడు ఎన్నికల కమీషన్ ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికల నిర్వహించడానికి సిద్ధమవుతూ..ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిని ప్రభుత్వం కాదని చెప్పింది. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయని..ఎక్కువ మంది అధికారులు కరోనా విధుల్లో ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. అయినా సరే ఎన్నికల కమీషన్ ఎన్నికల నిర్వహణ నుంచి వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
ఎన్నికల కమీషన్ నిర్ణయాలపై స్టేటస్ కో ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టు ( High court )లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు..స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేవని రాష్ట్రంలో లేవని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే కరోనా బారిన పడి రాష్ట్రంలో 6 వేల మంది మరణించారని తెలిపింది.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు..స్టే ఇవ్వలేమని చెప్పింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. Also read: Ap Assembly live updates: చంద్రబాబు ఎన్నిసార్లు...ఎక్కడి నుంచి పారిపోయారో...వివరించిన కొడాలి నాని