Viajayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా రన్ వే, ఈ నెల 15న ప్రారంభం

Viajayawada Airport: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా అధునాతన రన్ వే నిర్మితమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 1, 2021, 11:11 AM IST
  • విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా రన్ వే
  • ఈ నెల 15న ప్రారంభం కానున్న విజయవాడ విమానాశ్రయం రన్ వే
  • 7 వందల ఎకరాల్లో విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు, సమీపంలో ఫ్లై ఓవర్ నిర్మాణం
 Viajayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో నూతనంగా రన్ వే, ఈ నెల 15న ప్రారంభం

Viajayawada Airport: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఏపీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా అధునాతన రన్ వే నిర్మితమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాలకు కొదవ లేదు. రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు జాతీయ విమానాశ్రయాలు నాలుగున్నాయి. రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతున్నాయి. విజయవాడ విమానాశ్రయం(Vijayawada Airport)ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతనంగా అధునాతన రన్ వే నిర్మించారు. ఈ రన్ వేను( New Runway)ఈ నెల 15న ప్రారంభించనున్నారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయాన్ని 7 వందల ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టారు.ఈ పనుల్ని త్వరలో పూర్తి చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్ తెలిపారు. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించిన రెవిన్యూ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయంలో చేపట్టిన పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విమానాశ్రయంలో సమీపంలో నిర్మించతలపెట్టిన ఫ్లై ఓవర్‌కు సంబంధించిన ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని అధికారుల్ని కోరారు. 

Also read: AP Corona Update: ఏపీలో కొనసాగుతున్న కరోనా ప్రభావం, తగ్గిన కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News