కొత్త ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం ; సెప్టెంబర్‌ 5 నుంచి షురూ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరి కొత్త ఇసుక పాలసీ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.

Last Updated : Aug 27, 2019, 06:48 PM IST
కొత్త ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం ; సెప్టెంబర్‌ 5 నుంచి షురూ 

అమరావతి: రాష్ట్రంలో సరి కొత్త ఇసుక పాలసీ అమలుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్‌ 5 నుంచి దీన్ని అమల్లో తీసుకురానున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఏపీ సీఎం జగన్  ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక పాలసీపై చర్చించిన జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. 

సమీక్షా సమావేశం సీఎం జగన్ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని సంకేతాలు ఇచ్చారు. గతంలో కంటే తక్కువ ఇసుక అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. ఇసుక ధర తగ్గాలంటే  సరఫరా పెంచడం ఒక్కటే మార్గమని..ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో గుర్తించిన స్టాక్‌ యార్డుల్లో ఇప్పటి నుంచే ఇసుక నింపడం మొదలు పెట్టాలని.. అవకాశమున్న ప్రతి చోటా ఇసుక రీచ్‌లు పెంచాలన్నారు. దీంతో పాటు ఇసుక రవాణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని..రవాణాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు  సీఎం దిశానిర్దేశం చేశారు.

ఇసుక మాఫీయా కారణంగా రాష్ట్రంలో ఇసుక ధరలు ఆకాశానంటాయి. దీంతో జగన్ సర్కార్ పై విమర్శలు ఊపందుకున్నాయి. ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై ఇసుకాస్త్రాన్ని ప్రయోగిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాను అరికట్టి..తక్కువ ధరకే ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సరికొత్త ఇసుక పాలిసీని సిద్ధం చేశారు.

Trending News