Palnadu Road Accident: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం...

Palnadu Road Accident:  పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా... మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 06:47 AM IST
  • పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీని ఢీకొట్టిన టాటాస్ ఏస్ వాహనం
  • ఆరుగురు దుర్మరణం.. మరికొందరికి తీవ్ర గాయాలు
 Palnadu Road Accident: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం...

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ టాటా ఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులను రెంటచింతలకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెంటచింతల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన దాదాపు 38 మంది శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం (మే 29) రాత్రి తిరుగు పయమనమయ్యారు. ఈ క్రమంలో వీరంతా టాటా ఏస్ వాహనంలో కిక్కిరిసి ప్రయాణించారు. వాహనం రాత్రి 11.50 గం. సమయంలో రెంట చింతల సబ్‌స్టేషన్‌ మీదుగా వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న ఓ సిమెంట్ లారీని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

వేగంగా ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. వాహనం కిక్కిరిసిపోయి ఉండటంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అన్నవరపు కోటమ్మ (70), పులిపాడు కోటేశ్వరమ్మ (60), నారాయణపురం రోశమ్మ (70), మక్కెన రమణ (50), కురిసేటి రమాదేవి (50), పెద్దారపు లక్ష్మీనారాయణ (32)గా గుర్తించారు. 

రెంటచింతల సబ్ స్టేషన్ సమీపంలో అంతా చీకటిగా ఉండటంతో.. అక్కడ నిలిపి వున్న లారీని డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. నిత్యం తిరిగే మార్గమే కదా అన్న నిర్లక్ష్యంతో డ్రైవర్ వాహనాన్ని వేగంగా డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Also Read: Horoscope Today May 30 2022: రాశి ఫలాలు.. ఆ 3 రాశుల వారికి నేడు శభవార్తలు అందుతాయి...

Also Read: IPL 2022 Final GT vs RR Live Updates: చెలరేగిన గిల్, హార్దిక్.. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News