పరిటాల ఇంట్లో వేడుకగా మరో శుభకార్యం

పరిటాల ఇంట్లో త్వరలోనే జరగనున్న మరో శుభకార్యానికి ఇవాళ తొలి అడుగుపడింది.

Last Updated : Mar 29, 2018, 09:25 PM IST
 పరిటాల ఇంట్లో వేడుకగా మరో శుభకార్యం

పరిటాల ఇంట్లో త్వరలోనే జరగనున్న మరో శుభకార్యానికి ఇవాళ తొలి అడుగుపడింది. గతేడాది పరిటాల రవీంద్ర, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహ వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆ ఇంట్లో పరిటాల శ్రీరామ్ సోదరి, పరిటాల దంపతుల గారాలపట్టి అయిన పరిటాల స్నేహలత వివాహం జరగనుంది. అందులో భాగంగానే ఈరోజు నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది. పరిటాల స్వగ్రామమైన రామగిరి మండలం వెంకటాపురంలో గురువారం పరిటాల రవీంద్ర సోదరి శైలజ కుమారుడు వడ్లమూడి శ్రీహర్షతో పరిటాల స్నేహలతకు వివాహం నిశ్చయమైంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎస్పీ అశోక్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ రమామణితో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. 

పరిటాల స్నేహలత డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పూర్తీ చేయగా ఆ ఇంటికి అల్లుడిగా రాబోతున్న వడ్లమూడి శ్రీహర్ష యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పరిటాల స్నేహలత, వడ్లమూడి శ్రీహర్షల వివాహం మే6న స్వగ్రామమైన వెంకటాపురంలో నిర్వహిస్తున్నట్టు మంత్రి పరిటాల సునీత, ఆమె తనయులు పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్ధార్థ మీడియాకు తెలిపారు. 

Trending News