close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ప్రయాణికులు గమనించగలరు....ఆరు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు

నిర్మాణ పనులు, మరమ్మతుల కారణంగా పలు రైళ్లును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది

Updated: Jun 15, 2019, 02:59 PM IST
ప్రయాణికులు గమనించగలరు....ఆరు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు

గుంటూరు-దొనకొండ మర్గం మధ్యలో తిరిగే ప్యాసింజరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్న రైల్వే శాఖ ప్రకటించింది.  నిర్వహణ పనుల కారణంగా అధికారుల నిర్ణయం తీసుకున్నారు. ఆరు రోజులపాటు అంటే ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఇది వస్తుంది. ఈ రూట్ లో తిరిగే కొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు ఉంటాయని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. ప్రమాణీకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ....
57328 గుంటూరు - డోన్‌ ప్యాసింజర్‌ ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రద్దు
57327 డోన్‌ - గుంటూరు ప్యాసింజర్‌ ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రద్దు 
77247 అలాగే రేపల్లె - మార్కాపురం రోడ్డు ప్యాసింజర్‌   ఈనెల 17,21 తేదీల్లో గుంటూరు వరకే 
77249  మార్కాపురం రోడ్డు - తెనాలి ప్యాసింజర్‌  ఈనెల 17,21 తేదీల్లో గుంటూరు నుంచి నడుస్తుంది. 

ఇదిలా ఉండగా హుబ్లీ – విజయవాడ ప్యాసింజర్ ఈ నెల 17న 15 నిమిషాలు, 21వ తేదీన 45 నిమిషాలు మార్గమధ్యలో క్రమబద్ధీకరిస్తారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ఈ వేళ్లలో ప్రయాణించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది