Pawan Kalyan: పవన్ మరో రేర్ రికార్డు.. ఎమ్మెల్యేగా కాకుండా నేరుగా మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న కొణిదెల కొదమ సింహం..

Pawan Kalyan Deputy CM: 2024 ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసాయి. అంతేకాదు ఈ కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ సారి ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. ఏపీ అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా కాకుండా.. మంత్రిగా అడుగుపెట్టబోతూ రికార్డు క్రియేట్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 12, 2024, 11:37 AM IST
Pawan Kalyan: పవన్ మరో రేర్ రికార్డు.. ఎమ్మెల్యేగా కాకుండా నేరుగా మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న కొణిదెల కొదమ సింహం..

Pawan Kalyan:  అవును కొణిదెల కొదమ సింహం  పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కాకుండా.. డైరెక్ట్ గా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం. 2009లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో  జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇచ్చారు.ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీలో జట్టు కట్టి ఎన్నికల బరిలో తొలిసారి దిగారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గాజువాక, భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కేవలం జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే వైసీపీకి అనుబంధంగా వెళ్లిపోయారు.

కానీ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పడిలేచిన కెరటంలో కూటమిలో 21 శాసనసభ స్థానాలు.. రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డులకు ఎక్కింది. అటు బిహార్ లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ కూడా పోటీ చేసిన 5 ఎంపీ స్థానాలన్నింటిలో విజయం సాధించడం విశేషం.  

ఈ రోజు  చంద్రబాబు ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఒక రకంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ .. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా కాకుండా.. డైరెక్ట్ గా మంత్రిగా అడుగుపెట్టడం విశేషం. అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు. ఇపుడు ఓ నటుడిగా పవన్ కళ్యాణ్ రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలుపొందారు. అంతేకాదు తొలిసారి అసెంబ్లీలో బాధ్యతాయుతమైన పాత్రలో అడుగుపెట్టబోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా తొలిసారే మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోవడం విశేషం.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News