Pawan Kalyan in Swamy attire: స్వామీజీ అవతారంలో పవన్ కల్యాణ్.. ఫోటోలు వైరల్

Pawan Kalyan in Tirumala temple: తిరుమల: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఆధ్యాత్మికవేత్త అవతారంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకోగా.. ఎప్పటికంటే భిన్నంగా ఈసారి ఆయన కంటే ఆయన ధరించిన దుస్తులే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యాయి.

Last Updated : Jan 22, 2021, 05:53 PM IST
Pawan Kalyan in Swamy attire: స్వామీజీ అవతారంలో పవన్ కల్యాణ్.. ఫోటోలు వైరల్

Pawan Kalyan in Tirumala temple: తిరుమల: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఆధ్యాత్మికవేత్త అవతారంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకోగా.. ఎప్పటికంటే భిన్నంగా ఈసారి ఆయన కంటే ఆయన ధరించిన దుస్తులే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యాయి. పవన్ కల్యాణ్ సాదాసీదాగా పూర్తి ఆధ్యాత్మిక వేత్త అవతారంలో ఆలయం నుంచి బయటికి రాగానే అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు. 

Pawan-Kalyan-in-Tirupati-Pawan-Kalyan-spotted-in-tirupati-temple-visit

జనసేన పార్టీ ( Janasena party ) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కోసం గురువారం తిరుపతికి విచ్చేసిన జనసేనాని పవన్ కల్యాణ్... శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ), పార్టీకి చెందిన ఇతర కీలక నేతలు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) వెంట ఉన్నారు.

Pawan-kalyan-donated-rs-30-lakhs-for-ayodhya-ram-mandir-construction

అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణానికి ( Sriram temple ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూ. 30 లక్షలు విరాళంగా అందించారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్య నేత భరత్‌కి ఈ విరాళానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. 

Pawan-Kalyan-spotted-in-tirupati-temple-visit-Pawan-kalyan-donated-rs-30-lakhs-to-ayodhya-ram-mandir

Pawan Kalyan వ్యక్తిగత సిబ్బంది రూ. 11,000 మొత్తాన్ని విరాళంగా అందించగా ఆ చెక్కును కూడా పవన్ కల్యాణ్ ఆర్ఎస్ఎస్ నేత భరత్‌కి ( RSS leader Bharat ) అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News