స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు

దేశ రాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్, అమరావతి, విజయవాడల్లో శుక్రవారం నవంబర్ 15న డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ పెట్రోల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Updated: Nov 15, 2019, 11:00 AM IST
స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
Representational image

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్, అమరావతి, విజయవాడల్లో శుక్రవారం నవంబర్ 15న డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ పెట్రోల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం పెట్రోల్ ధరల్లో 18 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ. 78.36 కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 71.80 వద్ద కొనసాగుతోంది. అమరావతిలోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ.77.95 చేరింది. ఇక డీజిల్ ధర రూ. 71.10 వద్ద స్థిరంగా ఉంది. 

ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధరలు 19 పైసలు పెరిగి రూ.77.59కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 70.76 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ.73.63 మార్కును తాకగా ఇక లీటర్ డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.65.79 వద్ద కొనసాగుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ పరిస్థితి అలాగే ఉంది. లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ.79.30లకు చేరగా లీటర్ డీజిల్ ధర రూ.69.01 వద్ద స్థిరంగా ఉంది.