Pinnelli: పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..ఈసీ

Pinnelli: ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను విధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎలక్షన్ కమిసన్ వెల్లడించింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 23, 2024, 09:26 AM IST
Pinnelli: పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..ఈసీ

Pinnelli: ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ నెల 13న 175 అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ సీట్లకు ఎన్నికల జరిగాయి. అంతేకాదు ఏపీలో పలు ప్రాంతాల్లో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) లను ధ్వంసం చేస్తుండగా లీకైన వీడియో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను  ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. అంతేకాదు ఈవీఎంలను ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొంది. అంతేకాదు పోలీసులు రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిపై ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటంతో పాటు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం..ఈవీఎంలను ధ్వంసం చేయడం వంటి పలు నేరాలపై ఆయనపై వివిధ సెక్షన్స్ కింద 10కి పైగా కేసులు నమోదు చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అంతేకాదు ఈ కేసుల్లో పిన్నెల్లిపై దాదాపు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో పిన్నెల్లి చేసిన ఘటన ఓ వైఫల్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పిన్నెల్లి అరెస్ట్ కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఆయన ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని నివాప గృహాల్లో సోదాలు నిర్వహించారు. అప్పటికే పిన్నెల్లి రాష్ట్రం వదిలి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.

ఈవీఎంల ధ్వంసం కేసులో ఈ నెల 20న కోర్టులో రెంటచింతల ఎస్సై మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చింది. మొదటి గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఈ నెల 21వీడియో ఫుటేజీ బయటకు రావడంతో  పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అయింది.

ఈ సందర్భంగా మాచర్ల నియోజవర్గంలో ఈవీఎంలపై దాడి, అల్లర్లు, వివిధ వ్యక్తులపై దాడులకు సంబంధించి ప్రాథమిక విచారణ నివేదికను ఈసీకి పంపించినట్టు పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో అని ఎదురు చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పిన్నెల్లికి పడే శిక్షతో ఆయనపై అనర్హత వేటుతో పాటు భవిష్యత్తులో ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించినట్టు ఈసీ తెలిపింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఎవరినీ ఒదలిపెట్టే ప్రసక్తి లేదని ఎన్నికల సంఘం  పేర్కొంది. రెండేళ్లకుపైబడి శిక్ష పడితే అనర్హత వేటు పడుతుందని వెల్లడించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 20 కంపెనీల బలగాలను అదనంగా కేటాయించింది. అల్లర్లు జరిగేందుకు ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో ప్పటికే పోలీసులు గుర్తించారు. పికెట్లు ఏర్పాటు చేసినట్టు ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.పరారీలో ఉన్న పిన్నెల్లి హైదరాబాద్ శివారు రుద్రారంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆయన కారుతో పాటు డ్రైవరును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిన్నెల్లి పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..

ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News