చంద్రబాబుకి విష్ చేసిన ప్రధాని మోడీ !!

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు

Updated: Apr 20, 2019, 11:27 AM IST
చంద్రబాబుకి విష్ చేసిన ప్రధాని మోడీ  !!

మోడీ గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే పోరాటం చేస్తుదన్నందుకు కాదండోయ్.. ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బర్త్ డే.  69వ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు టీడీపీ అధినేత పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.