AP Politics: తెలంగాణలో ప్రభుత్వం త్వరలో కూలిపోనుందా, విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

AP Politics: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2024, 05:53 PM IST
AP Politics: తెలంగాణలో ప్రభుత్వం త్వరలో కూలిపోనుందా, విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

AP Politics: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకున్న తరువాత రాష్ట్రంలో వాతావరణం కాస్త వేడెక్కింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల తరచూ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ ఇచ్చే కౌంటర్ సమాధానాలతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు అసలైన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనేనని, ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం ఆ పార్టీకు ఎప్పుడూ లేనేలేదని రాజ్యసభ సభ్యుడ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. నిజంగా ఏపీకు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యమే కాంగ్రెస్ పార్టీకు ఆనాడు ఉండి ఉంటే..విభజన చట్టంలో ఈ అంశాన్ని పెట్టి ఉండేదని చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని నాడు చట్టంలో చేర్చడం చేతకాని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇతరుల్ని నిందిస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. 

పదేళ్లు పాలించి చివరికి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిందని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 10 రోజుల ముందే రాష్ట్రాన్ని విభజించారన్నారు. కాంగ్రెస్ పార్టీకు ఎప్పుడూ ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచన తప్ప మరేదీ ఉండదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఏపీకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్‌లో భాగమన్నారు. అన్నింటికంటే మించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయని విజయసాయి రెడ్డి తెలిపారు. 

ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయనే విషయాన్ని గుర్తు చేళారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం వల్లనే ఆ పార్టీకు ప్రజలు సరైన శిక్ష విధించారన్నారు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో సైతం రాహుల్ గాంధీ ఓడిపోతారని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 

Also read: AP Assembly Budget Session 2024: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నిరోజులంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News