Ram Gopal Varma: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ పోటీ

Ram Gopal Varma Contest in Pithapuram: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీపై ఆర్జీవీ రియాక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవీ ఎక్స్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆలోచింపచేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2024, 05:26 PM IST
Ram Gopal Varma: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ పోటీ

Ram Gopal Varma Contest in Pithapuram Against Pawan Kalyan: అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సంచలనం రేపే రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నిజంగా చేసిందేనా లేక ఇది కూడా సెటైరా అనేది అర్ధం కావడం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ అని మాత్రం అర్ధమౌతోంది. 

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన ఇప్పటికే రెండు జాబితాల్లో 14 మందిని ప్రకటించింది. కానీ ఈ రెండు జాబితాల్లోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ్నించి అనేది స్పష్టత రాలేదు. పార్టీ అధ్యక్షుడై ఉండి ఎక్కడ్నించి పోటీ అనేది చెప్పలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హఠాత్తుగా రెండో జాబితా ప్రకటించిన తరువాత తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు. ఇంత హఠాత్తుగా ప్రకటించడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే..జనసైనికులు మాత్రం ఆనందం వ్యక్తపరుస్తున్నారు. 

అదే సమయంలో పవన్ కళ్యాణ్ అంటేనే సెటైర్లు విసిరే ఆర్జీవీ ఎక్స్‌లో చేసిన పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. Sudden Decision..Am Happy to inform that iam contesting from Pithapuram అని ఎక్స్‌లో పోస్ట్ చేసి సంచలనం రేపారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ ప్రకటనకు సెటైరా లేక నిజంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఈ రెండు కాకుండా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఆర్జీవీకు నిజంగా ఆనందం కల్గిస్తుందా అనేది సందేహంగా మారింది.

మొత్తానికి ఆర్జీవీ చేసిన పోస్ట్ ఆలోచింపచేస్తోంది. కొందరైతే పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా కౌంటర్ ఇచ్చాడంటుంటే...మరి కొందరు ఏ పార్టీ తరపునంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సెటైరికల్ కామెంట్లు చేయడంలో ఆర్జీవీ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. 

Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పోటీ పిఠాపురం నుంచే, విజయం సులభమేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News