Roja Counter To Pawan: పొత్తులో భాగంగా జనసేకు దక్కిన 24+3 సీట్లపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ నమ్మించి మోసం చేసిందని.. పవన్ మళ్లీ చంద్రబాబు చేతిలో మోసపోయాడనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో జనసేనపై, పవన్ కల్యాణ్‌పై తీవ్రంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ క్రమంలో తనదైన శైలిలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. పొత్తుతో ఏం సాధించావని నిలదీశారు. పదేళ్లుగా కష్టపడుతున్న జన సైనికులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Also Read: Inter Hall Tickets: ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..
టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై మంత్రి రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలి' అని కోరారు. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? అని నిలదీశారు. 24 సీట్లకే తోక ఊపుకుంటు చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నావా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచవో జన సైనికులకు చెప్పాలని సవాల్ విసిరారు.
Also Read: Muddapappu, Egg: ఏపీ రాజకీయాల్లో 'ముద్దపప్పు, కోడిగుడ్డు' రచ్చ.. ప్రజలకు మస్త్ వినోదం
ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌పై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. '40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు. సీఎం జగన్‌ను ఓడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారు' అని తెలిపారు. వాళ్లలో వాళ్లకే గందరగోళం ఉందని తెలిపారు. ఇలాంటి గందరగోళ పరిస్ధితిలో ప్రకటించిన 118 స్థానాల్లో ఎవరూ గెలవలేరని జోష్యం చెప్పారు. పవన్ పోటీ చేసే స్థానం ప్రకటించపోవడాన్ని రోజా తప్పుబట్టారు. 'చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ పోటీ చేసే స్థానాలు కూడా ప్రకటించారు. కానీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు' అని గుర్తు చేశారు. పవన్ పోటీ చేసే స్థానం ప్రకటించకపోవడానికి గల కారణం రోజా తెలిపారు. '1వ స్థానంలో ఓడిపోయిన వారికి మొదటి జాబితాలో, 2 స్థానాల్లో ఓడిపోయినవారికి రెండవ జాబితాలో పేరు ఇస్తారేమో పవన్ తెలుసుకోవాలి' అని హితవు పలికారు.
కుక్కకి బిస్కట్లు పడేసినట్టు అరకొర సీట్లు పడేస్తే @JanaSenaParty తమ వెంటే ఉంటుందని @ncbn అన్నట్టు అప్పట్లో ఆవేశంతో ఊగిపోయాడు @PawanKalyan. మరి ఇప్పుడు అదే చంద్రబాబు పడేసిన 24 సీట్లే మహాప్రసాదం అనుకుంటున్నాడా? #TDPJSPCollapse pic.twitter.com/PJlCtj0Vme
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 24, 2024
ఇక సీట్ల పంపకంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలా తదితరులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చంద్రబాబు చేతిలో మరోసారి పవన్ మోసపోయాడని జాలి చూపిస్తున్నారు. ఇక మరికొందరు నాదెండ్ల మనోహర్ పవన్‌ను బలి తీసుకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఈ సీట్ల పంపకాలతో ఏపీలో జనసేన, టీడీపీ అసంతృప్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరికొందరు టికెట్ ఆశపడిన వారు ఆయా పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook