సంక్రాంతికి తెలంగాణ - ఏపీ మధ్య 31 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి 31 ప్రత్యేక రైళ్లు

Last Updated : Jan 10, 2019, 01:31 PM IST
సంక్రాంతికి తెలంగాణ - ఏపీ మధ్య 31 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: సంక్రాంతి పండగ వచ్చిందంటే హైదరాబాద్ మహా నగరం తిరిగి పల్లె బాట పడుతుందనే సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ వేళ పెరగనున్న రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా హైదరాబాద్, సికింద్రాబాల్ రైల్వే స్టేషన్ల నుంచి మరో 31 జనసదరన్ ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయా ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్- తిరుపతి, తిరుపతి- కాకినాడ, విజయవాడ, విజయనగరం మార్గాల మధ్య సేవలు అందించనున్నాయి. సికింద్రాబాద్- విజయవాడ, హైదరాబాద్- సికింద్రాబాద్, విజయవాడల మీదుగా ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో అన్‌రిజర్వుడ్ కోచ్‌లు ఉంటాయని, ఎటువంటి ప్రత్యేక రుసుములు చెల్లించకుండానే సాధారణ టికెట్ ధరలకే టికెట్ కొనుగోలు చేయవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈ నెల 11, 12, 13, 15, 16, 17, 18, 19 తేదీల్లో రాత్రి 11.30 గంటలకు బయల్దేరి, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతూ ఆ మరుసటి తేదీల్లోని ఉదయం 3 గంటలకు విజయవాడకు చేరుకోనున్నాయి. ఈ నెల 12, 13, 14, 16, 17, 18, 19, 20 తేదీల్లో విజయవాడ నుంచి బయల్దేరి తిరిగి సికింద్రాబాద్‌ చేరుకోనున్నాయి. ఇవే కాకుండా పలు ఇతర ప్రత్యేక రైళ్లు విజయనగరం వరకు సేవలు అందించనున్నట్టు సమాచారం.

Trending News