Sriharikota Corona: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే 12 మందికి పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులంతా కలవరపాటుకు గురయ్యారు.
న్యూ ఇయర్ వేడుకలకు బయటకు వెళ్లి వచ్చిన వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. షార్ నుంచి కరోనా సమాచారం బయటికి పొక్కకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కరోనా సోకిన వారిలో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నట్లు తెలిసింది.
సుళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్‌డీఎల్‌లలో ఒక్కొక్కరు, సూళ్లూరుపేట శివార్లలో మరో షార్ విశ్రాంత ఉద్యోగికి కరోనా సోకింది. షార్‌లో కరోనా కేసులు నమోదవ్వడం వల్ల సూళ్లూరుపేటలో కూడా కరోనా విస్తరించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
అయితే షార్‌లో డిసెంబరు 27 నుంచే కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు తెలిసింది. డిసెంబరు 27న ఇద్దరికి ఆ తర్వాత ఆదివారం ఒకరికి కోవిడ్ సోకినట్లు సమాచారం. షార్‌కు సంబంధం లేకుండా సూళ్లూరులోని ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
నెల్లూరులో 10 కరోనా కేసులు
సోమవారం నెల్లూరు జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,149 కి చేరింది. ప్రస్తుతం 104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,45,986 కరోనాను జయించగా.. 1059 మంది కోవిడ్ కాటుకు బలయ్యారు.
Also Read: Omicron Variant: ఏపీలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు
Also Read: Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపొద్దు: TTD ఛైర్మన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి