Jr Ntr: కమ్మోళ్లకు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారా? మామకు టికెట్ ఇవ్వలేదనే టీడీపీపై కోపమా?

Jr Ntr: విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ఏపీలో రాజకీయ కాక రేపింది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో జూనియర్ ఎంట్రీ మరో మలుపు తిప్పింది. జూనియర్ ట్వీట్ తో ఏపీలో చర్చంతా ఆయనవైపే మళ్లీంది.

Written by - Srisailam | Last Updated : Sep 27, 2022, 03:21 PM IST
  • జూనియర్ పై కమ్మ వర్గం గుస్సా
  • వైఎస్సార్ ను కీర్తించడంపై ఫైర్
  • జగన్ ట్రాప్ లో జూనియర్ ఉన్నారా?
Jr Ntr:  కమ్మోళ్లకు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారా? మామకు టికెట్ ఇవ్వలేదనే టీడీపీపై కోపమా?

Jr Ntr:  విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ఏపీలో రాజకీయ కాక రేపింది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో జూనియర్ ఎంట్రీ మరో మలుపు తిప్పింది. జూనియర్ ట్వీట్ తో ఏపీలో చర్చంతా ఆయనవైపే మళ్లీంది. హెల్త్ వర్శిటీ పేరు మార్పు అంశం పక్కకు పెట్టి జూనియర్ ను తమ్ముళ్లు, కమ్మ సామాజిక వర్గం  టార్గెట్ చేసింది. అటు తారక్ ఫ్యాన్స్ నుంచి అదే స్థాయిలో టీడీపీకి కౌంటర్లు వచ్చాయి. ఇరు వర్గాల మధ్య  సోషల్ మీడియాలో రచ్చరచ్చైంది. పేరు మార్చిన సీఎం జగన్ ను కాదని జూనియర్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడానికి కారణం ఆయన చేసిన ట్వీట్ లో వైఎస్సార్ ను మహానీయుడని పొగడమటే. తమకు ప్రధాన శత్రువుగా భావించిన వైఎస్సార్ ను జూనియర్ మహానేతగా కీర్తించడాన్ని కమ్మ వర్గం అసలు జీర్ణించుకోలేకపోతుందని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కులాభిమానం ఎక్కువ ఉండేది ఎవరికి అంటే కమ్మవర్గం పేరు చెప్పడం కామన్. ఆ విషయాన్నే కమ్మ వర్గం అంగీకరిస్తుంది.  ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని తమ సొంత పార్టీగా భావిస్తుంటారు మెజార్టీ కమ్మ ప్రజలు.
కులం విషయంలో కమ్మ వర్గం ఎక్కడ రాజీ పడదు. తమ అనుకున్న వారికోసం ఎంతకైనా తెగిస్తారు. మంచైనా.. చెడైనా అండగా నిలబడుతారు. తమ అనుకుంటేనే ఓన్ చేసుకుంటారు.. లేదంటే  ఎంత పెద్ద  పొజిషన్ లో ఉన్నా పక్కన పడేస్తారు. హెల్త్ వర్శిటీ విషయంలో జూనియర్ స్పందన పరోక్షంగా జగన్ కు లాభించేదనే భావనలో ఉన్న కమ్మ వర్గం.. జూనియర్‌ను తమకు కానివాడుగానే చూస్తుందనే చర్చ సాగుతోంది. ఇక్కడే జూనియర్ ఒరిజనల్ కమ్మ కాదనే వాళ్లు బయటికి వస్తున్నారు. హరికృష్ణ కొడుకన్న ముద్రతో ఇంత కాలం తారక్ ను తమవాడుగా భావించామని.. ప్రస్తుతం ఆయన తీరు చూస్తుంటే తమకు డౌట్లు వస్తున్నాయంటూ  కొందరు చేస్తున్న పోస్టులు సంచలనంగా మారుతున్నాయి.

ఏపీలో కమ్మ వర్గాన్ని తొక్కేయడానికి సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. తమను టార్గెట్ చేస్తున్న జగన్ కు మద్దతు ఇచ్చేలా జూనియర్ ఎలా వ్యవహరిస్తారన్నది కమ్మవర్గం ప్రశ్న. తన మామ వైసీపీలో ఉండటం వల్లే జూనియర్ ఇలా వ్యవహరిస్తున్నారని అనేవాళ్లు ఉన్నారు. ఇక్కడే మరో విషయాన్ని గుర్తు చేస్తున్నారు కమ్మ నేతలు. జూనియర్ మాట కోసం సీనియర్ నేత రావి శోభనాద్రి కుటుంబాన్ని కాదని గుడివాడలో కొడాలి నానికి చంద్రబాబు టికెట్ ఇచ్చారని చెబుతున్నారు. తన కుటుంబంలోని అమ్మాయిని చూసి జూనియర్ కు పెళ్లి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇవన్ని మర్చిపోయి తన మామ అయిన నార్నె శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వలేదనే కక్షతోనే టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జూనియర్ ను టార్గెట్ చేస్తున్న కమ వర్గం నేతలు మరో పాయింట్ ను బాగా ప్రచారం చేస్తున్నారు. జూనియర్ తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని.. ఆయన ప్రచారం చేసిన 2009లో టీడీపీ ఓడిపోయిందని చెబుతున్నారు. జూనియర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనే టీడీపీ ఎక్కువ ఓడిపోయిందంటున్నారు. విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో జూనియర్ ప్రచారం చేయకపోయినా టీడీపీ ఘన విజయం సాధించిందని పోస్టులు పెడుతున్నారు.
ఇప్పుడు నువ్వు వస్తే ఎంత? రాకపోతే ఎంత... అసలు ఎన్టీఆర్‌ను వైఎస్‌తో పోల్చినప్పుడే నువ్వు మా నుంచి దూరమయ్యావ్ అంటూ కొందరు కమ్మ  నేతలు సోషల్ మీడియాలో ఓపెన్ గానే వీడియోలు పెడుతున్నారు. జూనియర్ పై  కమ్మవర్గం నుంచి వస్తున్న స్పందనను బట్టి.. ఆతన్ని వాళ్లు తమవాడుగా భావించడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో జగన్ ట్రాప్ లో ఉన్నారనే వాదనను కొందరు వినిపిస్తున్నారు.  ఎన్టీఆర్ మనవడే వైఎస్ గొప్పతనాన్ని బహిరంగంగా ఒప్పుకునేలా జగన్ వ్యూహం పనిచేసిందని అంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను జూనియర్ కలవడం కూడా జగన్ ప్లానే అంటున్నారు. టీడీపీలో చీలిక తీసుకువచ్చేలా జగన్ ఈ స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు. ఇందుకు కొడాలి నాని చేసిన కామెంట్లే సాక్ష్యమంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్రను పక్కదారి పట్టించే వ్యూహం ఇందులో ఉందంటున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో జూనియర్ ను కమ్మ వర్గం పూర్తిగా వదిలేసిందనే చర్చే ఎక్కువగా సాగుతోంది. కమ్మ వర్గం నుంచి దూరమైన జూనియర్‌ తో వైసీపీ, బీజేపీకి వ్చచే ప్రయోజనం కూడా పెద్దగా ఉండదని కొందరు చెబుతున్నారు.

Read also: Munugode Bypoll: పెద్ద కులపోడే పదవులు చేయాలా! బూర, కర్నె కామెంట్ల కలకలం.. టీఆర్ఎస్ పై  బీసీల తిరుగుబాటేనా?

Read also: Chiru Support Jagan: జగన్ కు జై కొట్టిన చిరంజీవి, నాగార్జున.. టీడీపీలో కలవరమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News