డిజిటల్ లావాదేవీల్లో తెలుగు రాష్ట్రాలే ఫస్ట్

దేశంలో ఈ ఏడాది 1.1 బిలియన్ డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.

Last Updated : Mar 6, 2018, 11:55 AM IST
డిజిటల్ లావాదేవీల్లో తెలుగు రాష్ట్రాలే ఫస్ట్

ఈ ఏడాది దేశంలో 1.1 బిలియన్ డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. ఇందులో 7.78 కోట్ల లావాదేవీలతో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. ప్రతి 1000 మంది వ్యక్తులు సగటున 2,210 డిజిటల్ లావాదేవీలు జరిపారు. అలానే 1,839 లావాదేవీలతో ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది.

హిమాచల్ ప్రదేశ్ 1532 లావాదేవీలతో, గుజరాత్ 1053 లావాదేవీలతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రతి 1000 మందికి వ్యక్తులు సగటున 23,872 డిజిటల్ లావాదేవీలు జరిపారు. రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నివేదికల ప్రకారం,  డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో నగదు రహిత చెల్లింపులు 4.73 శాతం పెరిగాయి. జనవరిలో 1.11 బిలియన్లు ఉండగా, డిసెంబర్‌లో 1.06 బిలియన్లు నమోదయ్యాయి. మొత్తంగా 1 ఏప్రిల్ 2017 నుండి జనవరి 2018 వరకు కేవలం 14.8 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 31  నాటికి (ఆర్థిక సంవత్సరం 2017- 2018 ముగిసే నాటికి) 26 బిలియన్ల లావాదేవీల లక్ష్యానికి ఇది దూరంగా ఉంది.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి డెబిట్ కార్డులు, భీమ్ యుపీఐ (BHIM UPI), ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంల ద్వారా రూ.2,000 వరకు లావాదేవీల మీద ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలను భరిస్తుందని కేంద్రం డిసెంబర్ 2017లో ప్రకటించిన సంగతి తెలిసిందే..!

Trending News