Covid Border Dispute: కరోనా ఉధృతి నేపధ్యంలో సరిహద్దుల వద్ద వివాదం ప్రారంభమవుతోంది. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ రోగుల్ని అడ్డుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారు.
కరోనా మహమ్మారి (Coronavirus) ఉధృతి వేళ రాష్ట్రాల సరిహద్దుల్లో వివాదం అధికమమవుతోంది. కొన్ని రాష్ట్రాల్నించి వచ్చే రోగుల్ని మరికొన్ని రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. ఫలితంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో(Ap-Telangana Borders) ఈ వివాదం ప్రారంభమైంది.తెలంగాణ పోలీసులు విధించిన ఆంక్షల నేపధ్యంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆస్పత్రి అనుమతి పత్రాలు తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు అంటున్నారు. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ బాధితుల అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్స్‌లకు అనుమతి ఇస్తున్నారు. సాధారణ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల అంబులెన్స్‌లను(Ambulances) తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. తెలంగాణలో ఆక్సిజన్, బెడ్స్ కొరత కారణంగా ఇతర రాష్ట్రాల రోగులకు అనుమతి నిరాకరిస్తున్నారు.
Also read: Oxygen Plants Construction: ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తున్న NHAI
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook