AP vs Telangana: తెలంగాణ కొత్త ప్రభుత్వంతో ఏపీ సయోధ్య కొనసాగునుందా, బ్రేక్ పడుతుందా

AP vs Telangana: తెలంగాణలో ప్రభుత్వం మారింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఏపీకు మిత్రపక్షంగా ఉండే ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఏపీ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2023, 08:04 AM IST
AP vs Telangana: తెలంగాణ కొత్త ప్రభుత్వంతో ఏపీ సయోధ్య కొనసాగునుందా, బ్రేక్ పడుతుందా

AP vs Telangana: తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోంది. ప్రజలు అధికార మార్పిడి కోరుకోవడంతో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ బ్రేక్ తీసుకుంది. ప్రత్యేక రాష్ట్రమిచ్చిన పార్టీ పట్ల పదేళ్ల తరువాత ప్రజలు కృతజ్ఞత తీర్చుకున్నారు. మరి ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి సఖ్యత కొనసాగుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇవాళ లేదా రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటి వరకూ వివిధ అంశాల్లో సఖ్యతగా ఉన్న బీఆర్ఎస్ ఓటమి పాలవడం ఏపీ ప్రభుత్వానికి కాస్త నిరాశే. ఎందుకంటే పొరుగున ఉన్న రాష్ట్రం కావడంతో పాటు నీటి సమస్యలు, ఆస్థుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకూ అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మంచి సుహృద్భావ వాతావరణం సాగింది. అదే పరిస్థితి కొనసాగుుతందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 

కాంగ్రెస్ పార్టీపై కోపంతో పార్టీ స్థాపించి అధికారంలో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో ఉండటమే ఇందుకు కారణం. సాగునీటి సమస్యలు, విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్థుల్లో వాటాలు అన్నీ ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కూడా ఏపీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య సయోధ్య ఆధారపడి ఉంటుందంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మినహాయించి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులే. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషిగా ముద్రపడి ఉండటం వల్ల అతను ముఖ్యమంత్రి అయితే రెండు రాష్ట్రాల మధ్య కాస్త ఇబ్బందికరక పరిణామాలు ఉండవచ్చు. 

పోలింగ్ ముందు రోజు నాగార్జున సాగర్ సగభాగాన్ని ఏపీ పోలీసులు తమ స్వాదీనంలో తెచ్చుకోవడం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జటిలం కానుందా అనే చర్చ కూడా రేగుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక పాత వైరం కొనసాగే పరిస్థితి ఉండదని, ప్రభుత్వాలు ఎప్పుడూ స్నేహంగా ఉండేందుకే ప్రయత్నిస్తాయనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలతో జగన్ స్నేహం ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే కొనసాగింది. అంతకుముందు వైఎస్ జగన్‌పై అప్పటి టీఆర్ఎస్ నేతలు చాలా ఆగ్రహంగా ఉండేవారు. ఉద్యమ సమయంలో అయితే జగన్ ఓదార్పు యాత్రకు వరంగల్‌లో ఎదురైన చేదు అనుభవం టీఆర్ఎస్ ప్రోద్భలంతో జరిగిందే అనేది కాదనలేని సత్యం. 

అందుకే ముఖ్యమంత్రి రేవంత్ అయినా భట్టి విక్రమార్క అయినా ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు స్నేహం, సయోధ్య కొనసాగుతాయనే అంతా ఆశిస్తున్నారు. అదే జరగాలి కూడా. లేకపోతే రెండు రాష్ట్రాలకు నష్టమే. మధ్యలో కొన్ని మీడియా సంస్థలు అనవసర విషయాల్ని పెద్దవిగా చేసి చూపించనంతవరకూ రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్యకు ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చు.

Also read: Venkata Ramanareddy: కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన మొనగాడు ఆయనే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News