Twins Record: ఆ ఇద్దరూ కవల సోదరులు..గూగుల్‌లో రికార్డు స్థాయిలో వేతనం

Twins Record: ఆ ఇద్దరూ కవలలు. ఒకేచోట చదివారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఒకే కంపెనీలో ఎంపికయ్యారు. అది కూడా రికార్డు స్థాయిలో ఇద్దరికీ సమానమైన వేతనంతో. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది జరిగింది ఎక్కడంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2021, 01:18 PM IST
Twins Record: ఆ ఇద్దరూ కవల సోదరులు..గూగుల్‌లో రికార్డు స్థాయిలో వేతనం

Twins Record: ఆ ఇద్దరూ కవలలు. ఒకేచోట చదివారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఒకే కంపెనీలో ఎంపికయ్యారు. అది కూడా రికార్డు స్థాయిలో ఇద్దరికీ సమానమైన వేతనంతో. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది జరిగింది ఎక్కడంటే..

ఇద్దరూ కవల సోదరులు. చిన్నప్పట్నించి అంటే స్కూలింగ్ నుంచి కాలేజింగ్ వరకూ కలిసే చదువుకున్నారు.ఎక్కడా విడిపోలేదు.పెద్దయ్యాక ఒకే సంస్థలో ప్లేస్‌మెంట్ ఉండాలని అనుకునేవారు తప్ప..జరుగుతుందని ఊహించలేదు. కానీ ఆ ఇద్దరి కలలు నిజమయ్యాయి. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ఎస్ఆర్ఎం కళాశాలలో చదువుకున్న ఆ ఇద్దరు కవల సోదరుల పేర్లు సప్తర్షి మజుందార్, రాజర్షి మజుందార్. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఇద్దరినీ గూగుల్ (Google) జపాన్ సంస్థ ఎంపిక చేసుకుంది. అంతే కాదు ఇద్దరికీ రికార్డు స్థాయిలో ఒకే వేతనం ఇచ్చింది.ఇద్దరూ చెరో 50 లక్షల వేతనానికి ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యధిక వేతనం ఇదే కావడం ఒక విశేషమైతే..ఒకేసారి ఇద్దరు కవలలు సమాన వేతనం పొందడం కూడా ఇదే తొలిసారి. ఒకే సంస్థలో ఉద్యోగం పొందాలనుకున్న తమ కల ఇంత గొప్పగా నెరవేరడంతో ఆ ఇద్దరు కవల సోదరుల ఆనందానికి హద్దు లేదు. అమరావతిలో ఏర్పాటైన ఎస్ఆర్ఎం కళాశాల (SRM College)తొలి బ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 4 వేల కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News