Budget 2022: విశాఖ రైల్వే జోన్‌ పట్టాలెక్కిస్తారా.. అటకెక్కిస్తారా!

union budget 2022: ఈ సారి బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం స్పష్టత నివ్వాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వేజోన్ హామీని నెరవేర్చాలని వారు ఆకాంక్షిస్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 11:48 AM IST
  • కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • విశాఖ రైల్వేజోన్ పై స్పష్టత రానుందా!
Budget 2022: విశాఖ రైల్వే జోన్‌ పట్టాలెక్కిస్తారా.. అటకెక్కిస్తారా!

Budget 2022- visakhapatnam railway zone: కేంద్రప్రభుత్వం మరికాసేపట్లో పార్లమెంటులో 2022-23కు (Budget 2022) సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈసారైనా విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కాలని రాష్ట్రప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌’ (visakhapatnam railway zone) ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది కేంద్రం. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. అయితే గత రెండు బడ్జెట్‌లలోనూ రైల్వేజోన్ కు సరైన నిధులు కేటాయించకుండా కేంద్రం మొండిచేయి చూపించింది.

తొలుత 2020-21 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా జోన్‌ (South Coast Railway Zone), రాయగడ డివిజన్‌ కోసం మూలధన వ్యయం కింద రూ.170 కోట్లు కేటాయించారు. ఆ తరువాత 2021-22లో ఖర్చుల కోసం రూ.40 లక్షలు చూపించారు. విశాఖపట్నం రైల్వే జోన్‌తోపాటు దాని పరిధిలోని డివిజన్ల ఏర్పాటులోనూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఇటీవల రైల్వే వెబ్‌సైట్‌లో కొన్ని రోజుల పాటు ఈ జోన్‌ పేరు కనిపించింది. ఆ తరువాత తొలగించారు. దీంతో అసలు జోన్‌ పట్టాలెక్కిస్తారా లేదా అనే అంశంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ (Union Budget 2022) పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Also Read: Budget 2022: దక్షణాది రాష్టాల బడ్జెట్ ఆశల చిట్టా ఇదే.. తెలుగు రాష్ట్రాల డిమాండ్స్ కేంద్రం నెరవేర్చేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News