CM Jagan: ఏపీ సీఎం జగన్ కు అమెరికా కోర్టు సమన్లు.. వైసీపీలో కలవరం!

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కోర్టు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పటికే ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లారు జగన్. తాజాగా జగన్ కు కోర్టు సమన్లు వచ్చాయి.

Written by - Srisailam | Last Updated : Sep 2, 2022, 01:16 PM IST
  • సీఎం జగన్ కు కోర్టు యూఎస్ కోర్టు సమన్లు
  • ఎన్నారై పిటిషన్ తో నోటీసులు
  • యూఎస్ కు నిధులు తరలించారని పిటిషన్
CM Jagan: ఏపీ సీఎం జగన్ కు అమెరికా కోర్టు సమన్లు.. వైసీపీలో కలవరం!

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కోర్టు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పటికే ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లారు జగన్. తాజాగా జగన్ కు కోర్టు సమన్లు వచ్చాయి. అయితే అవి పాత కేసులకు సంంబధించినవి కావు. మన దేశానికి చెందిన కోర్టుల నుంచి కూడా కాదు. ఏపీ సీఎం జగన్ కు అగ్రరాజ్యం అమెరికా కోర్టు సమన్లు పంపించింది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం జగన్ తో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బడా వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి యూఎస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఒక ఎన్నారై దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి వీళ్లకు సమన్లు వచ్చాయి..

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉయ్యూరు లోకేశ్ అమెరికాలోని కొలంబియాలో ఉంటున్నారు.  రిచ్ మండ్ లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుగా ఆయన పని చేస్తున్నారు. ఈ ఏడాది మే 24న అమెరికా స్థానిక కోర్టులో లోకేష్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. 53 పేజీల పిటిషన్ లో ఆయన పలు ఆరోపణలు చేశారు. అవినీతి, పెగాసస్ స్పైవేర్ తో పాటు అమెరికాకు అక్రమంగా నగదు తరలింపు చేశారని తన పిటిషన్ లో ఆరోపించారు. తన పిటిషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ, గౌతమ్ అదానీ, ఏపీ సీఎం జగన్ తో పాటు  ప్రపంచ ఆర్థిక సదస్సు ఛైర్మన్ క్లాస్ ష్వాబ్ పేర్లను లోకేశ్ ఉయ్యూరు ప్రస్తావించారు. వీళ్లంతా భారీగా అవినీతికి పాల్పడ్డారని, పెద్ద ఎత్తున డబ్బును అమెరికాకు తరలించారని లోకేష్ ఆరోపించారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై పెగాసన్ స్పైవేర్ ను ఉపయోగించారని పిటిషన్ లో చెప్పారు.

లోకేష్ ఉయ్యూరు పిటిషన్ ను విచారించిన అమెరికా స్థానిక కోర్టు.. ప్రతివాదులకు జూలై 22న నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోడీ, సీఎం జగన్, గౌతమ్ అదానీలకు ఆగస్టు 4న అమెరికా కోర్టు నోటీసులు వచ్చాయి. క్లాస్ ష్వాబ్ కు ఆగస్టు 2న సమన్లు జారీ అయ్యాయని తెలుస్తోంది. ప్రతివాదులకు కోర్టు పంపిన సమన్లు అందిన ఆధారాలను ఆగస్టు 19న  కోర్టుకు అందించారు లోకేశ్ ఉయ్యూరు. మరోవైపు ఈ పిటిషన్ పై ఇతర ఎన్నారైలు స్పందించారు.  పబ్లిసిటీ కోసమే లోకేశ్ అనవసరమైన పిటిషన్లు దాఖలు చేస్తుంటారని న్యూయార్కులో నివాసముంటున్న రవి బాత్రా చెప్పారు. గతంలో  కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ మీదా కేసులు వేశారని.. ఆ కేసులను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. అయినా మళ్లీ పిటిషన్లు వేశారని విమర్శించారు.

మరోవైపు సీఎం జగన్ కు అమెరికా స్థానిక కోర్టు నుంచి సమన్లు రావడం ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ వర్గాలు మాత్రం చిల్లర కేసుగా చెబుతున్నాయి.

Read Also: Whatsapp Case: ఇదేందయా ఇది.. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారంటూ కేసు.. పోలీసులు ఏం చేశారో తెలుసా? 

Read Also: CM Jagan: సీఎం జగన్ తో ముద్దుముద్దుగా మాట్లాడిన బాలిక మృతి.. అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News