దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చదివిస్తారా ?: చంద్రబాబును నిలదీసిన విజయసాయి రెడ్డి

దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చదివిస్తారా ?: చంద్రబాబు విమర్శలకు విజయసాయి రెడ్డి కౌంటర్

Updated: Nov 8, 2019, 01:59 PM IST
దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చదివిస్తారా ?: చంద్రబాబును నిలదీసిన విజయసాయి రెడ్డి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఏపీలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు నాయుడు చేస్తోన్న విమర్శలను విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై విమర్శలు చేస్తోన్న చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చదివిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఖరీదైన విద్యను అభ్యసించలేని నిరుపేదల అభివృద్ధిని చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ అడ్డుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేస్తోన్న విమర్శలపై శుక్రవారం ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పైనా విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. "స్కూళ్ళలో చైనీస్, జపనీస్ భాషలను కూడా నేర్పించాలని  చంద్రబాబు వకాల్తా పుచ్చుకున్న విషయం మాలోకానికి తెలిసి ఉండదు. ఎవరైనా పాత వీడియోలు చూపించి కాబోయే పార్టీ అధ్యక్షుడికి జ్ణానం ప్రసాదించండి కాస్త'' అంటూ విజయసాయి రెడ్డి నారా లోకేష్ ని ఎద్దేవా చేశారు.

స్కూళ్ళలో చైనీస్, జపనీస్ భాషలను కూడా నేర్పించాలని @ncbn వకాల్తా పుచ్చుకున్న విషయం మాలోకానికి తెలిసి ఉండదు. ఎవరైనా పాత వీడియోలు చూపించి కాబోయే పార్టీ అధ్యక్షుడికి జ్ణానం ప్రసాదించండి కాస్త. నాలుక మడత పెట్టడంలో తండ్రికి మించి పోయాడు.@naralokesh